
ఢిల్లీ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, మొదటి రోజు తొలి సెషన్ ముగిసే సమయానికి 25 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. ఓపెనర్లు ఆచితూచి ఆడడంతో ఆసీస్‌కి శుభారంభం దక్కింది. డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా జాగ్రత్తగా ఆడుతూ తొలి వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అయితే 44 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
అవుట్ అవ్వడానికి ముందు మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఓ బౌన్సర్ బలంగా తగలడంతో డేవిడ్ వార్నర్ చేతికి గాయమైంది. ఫిజియో చికిత్స తర్వాత తిరిగి బ్యాటింగ్ కొనసాగించిన వార్నర్, బౌన్సర్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడ్డాడు..
వార్నర్ అవుటైన తర్వాత మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా కలిసి రెండో వికెట్‌కి 41 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 25 బంతుల్లో 4 ఫోర్లతో 18 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్ఎస్ తీసుకున్న టీమిండియాకి అనుకూలంగా ఫలితం వచ్చింది...
టీవీ రిప్లైలో బంతి వికెట్లను తాకుతున్నట్టు స్పష్టంగా కనిపించడంతో లబుషేన్ నిరాశగా వెనుదిరిగాడు. అదే ఓవర్‌లో ఆఖరి బంతికి స్టీవ్ స్మిత్‌ని డకౌట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. 2 బంతులాడిన స్టీవ్ స్మిత్, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
గత రెండేళ్లలో స్టీవ్ స్మిత్‌ని అవుట్ చేయడం నాలుగోసారి... డకౌట్ చేయడం రెండోసారి. మెల్‌బోర్న్ టెస్టులో స్మిత్‌ని డకౌట్ చేసిన అశ్విన్, ఢిల్లీ టెస్టులో సున్నాకే పెవిలియన్ చేర్చి, ఈ ఘనత సాధించిన మొట్టమొదటి బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. మూడు బంతుల వ్యవధిలో ఐసీసీ నెం. 1 బ్యాటర్‌ని, నెం.2 బ్యాటర్‌ని పెవిలియన్ చేరాడు. మిడిల్ ఆర్డర్‌లో ట్రావిడ్ హెడ్ రావడంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్‌లో డెప్త్ పెరిగింది. దీంతో రెండో సెషన్‌లో టీమిండియా బౌలర్లు చూపించే ప్రదర్శనని బట్టి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరు ఆధారపడి ఉంటుంది..
నాగ్‌పూర్ టెస్టులో చూపించనట్టుగా టీమిండియా తొలి రోజే ఆస్ట్రేలియాని ఆలౌట్ చేయగలిగితే మాత్రం ఢిల్లీ టెస్టులో టీమిండియా పట్టు సాధించే అవకాశాలు పుషల్కంగా ఉంటాయి. 36 ఏళ్లుగా ఢిల్లీలో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఓడిపోలేదు భారత జట్టు. మరీ ముఖ్యంగా ఇక్కడ జరిగిన ఎక్కవ మ్యాచుల్లో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయాలు దక్కాయి...