చేతన్ రాజీనామా.. తదుపరి చైర్మన్ ఎవరు..? ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టులకు జట్టు ఎంపికపై ప్రభావం..!

Published : Feb 17, 2023, 12:03 PM ISTUpdated : Feb 17, 2023, 12:04 PM IST
చేతన్ రాజీనామా.. తదుపరి చైర్మన్ ఎవరు..? ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టులకు జట్టు ఎంపికపై ప్రభావం..!

సారాంశం

INDvsAUS: ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి  చేతన్ శర్మ రాజీనామా  చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కు మరో చిక్కు వచ్చిపడింది. 

టీమిండియా చీఫ్ సెలక్టర్ పదవికి  చేతన్ శర్మ రాజీనామా చేయడంతో   భారత క్రికెట్ మరోసారి  కుదుపునకు లోనైంది.  ఇండియన్ క్రికెట్ రహస్యాలను బయటపెట్టి  అటు బీసీసీఐతో పాటు  భారత క్రికెట్  పరువును నడిబజార్లో నిలబెట్టిన చేతన్.. స్టింగ్ ఆపరేషన్ ఎఫెక్ట్ తో  రాజీనామాకు మొగ్గుచూపాడు.   బీసీసీఐ అతడితో  వివరణ ఇవ్వాలని  కోరినా  అంతా  ప్రపంచం ముందున్న తర్వాత ఇంకా  ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేది ఏముంటుంది..? అనుకున్నాడో ఏమో గానీ  చేతన్  రాజీనామా  మరోసారి భారత క్రికెట్ లో చర్చనీయాంశమైంది. 

చేతన్  రాజీనామాతో భారత క్రికెట్ బోర్డుకు  కొత్త చిక్కు వచ్చి పడింది.   ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా  ఇప్పటికే రెండు టెస్టులకు  జట్టును ప్రకటించిన  సెలక్షన్ కమిటీ..  మరో రెండు టెస్టులకు  టీమ్ ను ప్రకటించాల్సి ఉంది.  

ఢిల్లీ టెస్టు  కొనసాగుతుండగానే  టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో కలిసి   సెలక్షన్ కమిటీ సమావేశం జరగాల్సి ఉండగా  చేతన్  సంచలన వీడియో బయటకు వచ్చింది. దీంతో అతడు రాజీనామా చేశాడు. ఈ ఎఫెక్ట్ తో  ఇప్పుడు భారత క్రికెట్ కు  చీఫ్ సెలక్టర్ లేకుండానే  టీమ్ ను ఎంపిక చేస్తారా..? లేక ఈ రెండు మూడు రోజుల్లో కొత్త చీఫ్ సెలక్టర్ ను ఎంపిక చేసి టీమ్ ను ప్రకటిస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది. 

చేతన్ రాజీనామాకు ముందు   సెలక్షన్ కమిటీ ఇది.. 

- చేతన్ శర్మ  (చీఫ్ సెలక్టర్) 
- శివ్ సుందర్ దాస్ 
- సుబ్రొతొ   బెనర్జీ 
- సలిల్ అంకోలా 
- శ్రీధరన్ శరత్ 

 

చీఫ్ సెలక్టర్ రాజీనామా అనంతరం  శివ సుందర్ దాస్  ఆ  పగ్గాలు చేపట్టనున్నాడని బోర్డు వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఈ భారత మాజీ ఓపెనర్ వాస్తవానికి జనవరిలోనే  చీఫ్ సెలక్టర్ రేసులో ఉన్నాడు.  గతేడాది టీ20 వరల్డ్ కప్ లో భారత వైఫల్యంతో సెలక్షన్ కమిటీపై వేటు వేసిన   బీసీసీఐ.. జనవరిలో కొత్త కమిటీని ప్రకటించింది. ఈ కమిటీ వచ్చి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు.   గత టర్మ్ లో   చీఫ్ సెలక్టర్ గా ఉన్న చేతన్ నే తిరిగి కొనసాగించడంపై చాలా మంది పెదవి విరిచినా బీసీసీఐ మాత్రం మరోసారి అతడిపై నమ్మకముంచి సెలక్షన్ కమిటీ చైర్మన్ గా కూర్చోబెట్టింది. కానీ చేతన్ మాత్రం  రచ్చ రచ్చ చేసి వెళ్లాడు. 

Also Read: స్టింగ్ ఆపరేషన్ ఎఫెక్ట్.. సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి చేతన్ శర్మ రాజీనామా

ఈ షాక్ తో బీసీసీఐకి మరోసారి కొత్త చైర్మన్ ను  వెతికిపట్టుకోవాల్సిన పని పడింది.  ఆ కొత్త చైర్మన్ శివ సుందర్ దాసేఅని  బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. దాస్ ను ప్రస్తుతానికి అతడినే తాత్కాలిక చీఫ్ సెలక్టర్ గా నియమించి తర్వాత  అతడినే కొనసాగించడమా..? లేక  మరో సభ్యుడిని (ఈ కమిటీలో ఐదుగురు ఉండాలి. చేతన్ వెళ్లిపోవడంతో  ప్రస్తుతం నలుగురే అయ్యారు) తీసుకుని   అతడిని  చైర్మన్ చేస్తారా..? అన్నది  ఆసక్తికరంగా మారింది.   

PREV
click me!

Recommended Stories

IND vs NZ: అభిషేక్ శర్మ విధ్వంసం.. రింకూ సింగ్ మెరుపులు.. కివీస్‌పై టీమిండియా ఘన విజయం
Abhishek Sharma : సిక్సర్లే సిక్సర్లు.. అభిషేక్ శర్మ షేక్ చేశాడు ! షో అదిరింది బ్రో !