బాబర్ ఆజమ్‌ని చూస్తుంటే తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు కనిపిస్తోంది... వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకునే అవకాశం ఉందంటూ రమీజ్ రాజా కామెంట్స్..
ఐసీసీ నెం.1 వన్డే బ్యాటర్‌గా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని ఆరంభించాడు బాబర్ ఆజమ్. ఇప్పటిదాకా 8 ఇన్నింగ్స్‌ల్లో 4 హాఫ్ సెంచరీలు వచ్చినా, ఒక్కదాంట్లో కూడా బ్యాటర్‌గా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు.
నెం.1 బ్యాటర్ ర్యాంకును కూడా కోల్పోయిన బాబర్ ఆజమ్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకోబోతున్నాడని సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం జరుగుతోంది.
undefined
తాను కెప్టెన్సీ నుంచి తప్పుకునే ఆలోచన లేదని బాబర్ ఆజమ్ ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు. అయితే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్ అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్, బ్యాటర్‌గానూ ఫెయిల్ అవ్వడంతో బాబర్ ఆజమ్ డిప్రెషన్‌లోకి వెళ్లాడని మాజీ పీసీబీ చీఫ్ రమీజ్ రాజా కామెంట్ చేశాడు..
‘బాబర్ ఆజమ్‌ని చూస్తుంటే తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు కనిపిస్తోంది. అతను ప్రతీ దానికి చిరాకు పడుతున్నాడు. ఫ్రస్టేషన్ బాగా పెరిగిపోయింది. పాకిస్తాన్ సెమీ ఫైనల్ చేరలేకపోవడంతో స్వదేశంలో మీడియాని, అభిమానులను ఎలా ఫేస్ చేయాలా? అనే భయం కూడా అతన్ని వెంటాడుతోంది..
సోషల్ మీడియా యుగంలో ఓ కెప్టెన్‌కి అయినా ఇది తప్పదు. ప్రెస్ మీట్స్‌లో బాబర్ ఆజమ్‌ని సూటి పోటి ప్రశ్నలతో మరింత విసిగిస్తున్నారు. ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు దాన్ని తట్టుకుని నిలబడడం చాలా ముఖ్యం. నాకు తెలిసి బాబర్ ఆజమ్, వన్డే వరల్డ్ కప్ 2023 ముగిసిన తర్వాత వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవచ్చు..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్, మాజీ పీసీబీ చీఫ్ రమీజ్ రాజా..