India vs Afghanistan T20I: ఆఫ్ఘనిస్తాన్ తో ఇండోర్ లో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్ అక్షర్ పటేట్ రెండు వికెట్లు తీసుకోవడంతో టీ20ల్లో 200 వికెట్లు తీసుకున్న బౌలర్ గా రికార్డు సృష్టించాడు.
Axar Patel reaches 200 T20 wickets: టీ20 క్రికెట్ లో భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 200 వికెట్లు తీసుకున్న ప్లేయర్ గా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇండోర్ వేదికగా అఫ్గానిస్థాన్ తో జరిగిన రెండో టీ20లో రెండో వికెట్ ను తీయడంతో అతను ఈ మైలురాయిని అందుకున్నాడు. టీ20 ఫార్మాట్ లో అక్షర్ పటేల్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డిండ్ మూడు విభాగాల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ టీ20 ఫార్మాట్లో 2,500కు పైగా పరుగులు చేశాడు.
టీ20 క్రికెట్ లో అక్షర్ పటేల్ 200 వికెట్లు తీసుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో రెండు వికెట్లు తీసుకోవడంతో ఈ ఘనత సాధించాడు. 2013 మార్చిలో టీ20ల్లో అరంగేట్రం చేసిన అక్షర్ పటేల్ 232 మ్యాచ్ లు ఆడి 200 వికెట్లు పడగొట్టాడు. టీ20 ఫార్మాట్ లో 9 కంటే తక్కువ ఎకానమీ రేటును కలిగి ఉన్నాడు. అత్యుత్తమ గణాంకాలు 4/21. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 136 మ్యాచ్ లలో 112 వికెట్లు పడగొట్టాడు.
David Warner: క్రికెట్ ఆడేందుకు హెలికాప్టర్ తో గ్రౌండ్ లో దిగిన డేవిడ్ వార్నర్.. ! వైరల్ వీడియో
IND VS AFG: టీ20ల్లో ఒకే ఒక్కడు.. 150వ మ్యాచ్ తో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు
టీ20ల్లో అక్షర్ పటేల్ 22.52 సగటుతో 2,545 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 134.65గా ఉంది. ఐదు అర్ధశతకాలు కూడా బాదాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్, ఎడమచేతి వాటం బ్యాట్స్ మన్ అయిన రవీంద్ర జడేజా టీ20 ల్లో 200 వికెట్లు, 2,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత ఆల్ రౌండర్ గా నిలిచాడు. ఈ ఫార్మాట్ లో 216 వికెట్లతో పాటు 3,382 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ రెండో స్థానంలో ఉన్నాడు.
ఓవరాల్ టీ20 గణాంకాల విషయానికి వస్తే 52 మ్యాచ్ లలో 250కి పైగా సగటుతో 49 వికెట్లు పడగొట్టాడు. ఈ విషయంలో అతని ఎకానమీ రేటు 7.4 ప్లస్ కాగా, 3/9 అతని ఉత్తమ గణాంకాలు. టీ20ల్లో బ్యాట్ తో రాణించిన ఈ వెటరన్ బ్యాట్స్ మన్ 144.40 స్ట్రైక్ రేట్ తో 361 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లలో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది.
ఒకే ఓవర్ లో 6,4,4,4, 6.. పాక్ షాహీన్ అఫ్రిది బౌలింగ్ ను చీల్చిచెండాడిన ఫిన్ అలెన్..