క్యాచ్‌కి అడ్డు వచ్చాడని కొట్టబోయాడు... మరీ ఇంత కోపం ఏంటయ్యా రహీమ్...

Published : Dec 14, 2020, 05:34 PM IST
క్యాచ్‌కి అడ్డు వచ్చాడని కొట్టబోయాడు... మరీ ఇంత కోపం ఏంటయ్యా రహీమ్...

సారాంశం

క్యాచ్‌ అందుకునే సమయంలో అడ్డుగా వచ్చాడని యంగ్ ప్లేయర్‌ని కొట్టబోయిన ముస్తాఫికర్ రహీమ్... బంగబందూ టీ20 కప్‌‌లో సంఘటన...  

బంగ్లాదేశ్ క్రికెటర్లు చేసే అతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లేక లేక ఒక్క మ్యాచ్‌లో గెలిస్తే చాలు, విజయగర్వంలో స్టేడియంలోనే నాగిని స్టేప్పులు వేస్తారు బంగ్లా క్రికెటర్లు. టాప్ టీమ్‌ ప్లేయర్లను కూడా హేలన చేస్తూ గ్రాఫిక్స్ చేస్తారు బంగ్లా అభిమానులు. బంగ్లా క్రికెటర్ ముస్తాఫికర్ రహీమ్ షార్ట్ టెంపర్ గురించి అందరికీ తెలిసిందే.

తాజాగా క్యాచ్‌కి అడ్డుగా వచ్చాడని ఓ యువ క్రికెటర్‌ను కొట్టబోయి వివాదంలో ఇరుక్కున్నాడు రహీమ్. బంగబందూ టీ20 కప్‌‌లో బంగ్లా ప్లేయర్లు బిజీగా ఉన్నారు. బెక్సింకో ధాకా జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారించిన రహీమ్... తన జట్టుకి విజయాన్ని అందించాడు. అయితే ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 17వ ఓవర్‌లో అఫిఫ్ కొట్టిన బంతిని అందుకునేందుకు పరుగెత్తాడు వికెట్ కీపర్ రహీమ్.

అయితే అప్పటికే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న నసుమ్ కూడా క్యాచ్ అందుకోవడానికి వచ్చాడు. రహీమ్‌ను గమనించని నసుమ్, అతనికి తగలబోయాడు. క్యాచ్ అందుకున్న వెంటనే ఆవేశానికి లోనైన ముస్తాఫికర్ రహీమ్... కొట్టడానికి చెయ్యి పైకెత్తాడు.

ఈ హఠాత్ సంఘటనతో షాక్‌కు గురైన నసుమ్... మౌనంగా ఉండిపోయాడు. వెంటనే పరిస్థితిని అర్థం చేసుకున్న జట్టు ప్లేయర్లు రహీమ్‌ను కూల్ డౌన్ చేసి, నసుమ్‌ను ఉత్సాహపరిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

 

PREV
click me!

Recommended Stories

IPL : ఆర్సీబీ అభిమానులకు పండగే ! 40 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ టీమ్ ప్లేయర్ !
Rohit Sharma : షాకింగ్.. అసలు విషయం చెప్పిన రోహిత్!