ఎలా ఆడాలో నేర్చుకో.. నువ్వు చెప్పకర్లేదు: వార్న్-ఖవాజాల మధ్య మాటల యుద్ధం

By Siva KodatiFirst Published Nov 25, 2019, 5:58 PM IST
Highlights

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌పై ఆసీస్ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌పై ఆసీస్ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. వివరాల్లోకి వెళితే... ఏదో అప్పుడప్పుడు కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్నందు వల్ల జట్టులో ఉండటానికి ఉపయోగపడవంటూ వార్న్ వ్యాఖ్యానించాడు.

జాతీయ జట్టులో స్థానం సంపాదించాలంటే ఎటువంటి ప్రదర్శన చేయాలో తెలుసుకోవాలని.. ఖవాజాను తప్పిస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం సరైనదేనని షేన్ ‌వార్న్ అభిప్రాయపడ్డాడు.

Also Read:కోహ్లీకి గులాబీ ఆహ్వానం పంపిన ఆసీస్ కెప్టెన్

ఈ వ్యాఖ్యలపై ఖవాజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆసీస్ జట్టులో ప్లేస్ దక్కించుకోవాలంటే ఏం చేయాలో నువ్వు నాకు చెప్పకర్లేదని... ఒకవేళ నీకు ఏమైనా అవసరం ఉంటే ఆ విధంగా ప్రయత్నించు అంటూ చురకలంటించాడు. తాను ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటానని... వార్న్ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని ఖవాజా స్పష్టం చేశాడు.

తాను ఒక బ్యాట్స్‌మెన్‌నని... తనకు పరుగులు చేయడం తెలుసునన్నాడు. తన రికార్డులు చూసి షేన్‌వార్న్ మాట్లాడాలని.... తన షీల్డ్ రికార్డు చూశాడా అంటూ ఖవాజా ప్రశ్నించాడు. దేశవాళీ క్రికెట్‌లో తన వన్డే రికార్డు గురించి వార్న్‌కు తెలుసా.. అదే సమయంలో ఆస్ట్రేలియా తరపున తాను సాధించిన రికార్డును కూడా చూడాలని ఖవాజా సూచించాడు.

తాను దేశవాళీలో ఆడినా.. జాతీయ జట్టుకు ఆడినా పరుగులే చేసి జట్టులో కొనసాగానని... అంతేకాని వార్న్ ఏదో సలహా చెబితే బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకోవాల్సిన అవసరం లేదని ఖవాజా స్పష్టం చేశాడు.

కాగా పాకిస్తాన్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ సందర్భంగా ఉస్మాన్ ఖవాజాపై వేటు పడింది. ఎన్నో రోజులుగా ఆసీస్ టెస్టు జట్టులో ఓపెనర్‌గా కొనసాగుతున్న ఖవాజాను తప్పించడంతో కలకలం రేగింది.

Also Read:సంజూ శాంసన్‌కు నో ఛాన్స్: సెలక్షన్ కమిటీని మార్చాలంటూ భజ్జీ ఫైర్

ఈ మధ్యకాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో పాకిస్తాన్‌తో సిరీస్‌కు ఖవాజాను తప్పించారు. ఈ క్రమంలో సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థించిన వార్న్ ఖవాజా ఆటతీరుపై మండిపడ్డాడు. 

click me!