కోహ్లీకి గులాబీ ఆహ్వానం పంపిన ఆసీస్ కెప్టెన్

By telugu teamFirst Published Nov 25, 2019, 3:33 PM IST
Highlights

ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్‌ టిమ్‌ పెయిన్ భారత సారథి విరాట్‌ కోహ్లికి గులాబీ ఆహ్వానం పంపించాడు. గత నాలుగేండ్ల నుంచి ఆస్ట్రేలియా వేసవి సీజన్‌ను గులాబీ టెస్టుతో  మొదలు పెడుతోంది. 

ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్‌ టిమ్‌ పెయిన్ భారత సారథి విరాట్‌ కోహ్లికి గులాబీ ఆహ్వానం పంపించాడు. గత నాలుగేండ్ల నుంచి ఆస్ట్రేలియా వేసవి సీజన్‌ను గులాబీ టెస్టుతో  మొదలు పెడుతోంది. 

గత ఏడాది సైతం భారత్‌తో ఆస్ట్రేలియా డే నైట్‌ టెస్టుకు రంగం సిద్ధం చేసింది. అనుమతి లేనిదే, మీ ఇష్టం వచ్చినట్టు డే నైట్‌ టెస్టు ఏ విధంగా నిర్వహిస్తారని బీసీసీఐ అప్పట్లో మండిపడింది. భారత క్రికెట్‌ బోర్డు ఆగ్రహానికి తలొగ్గిన క్రికెట్‌ ఆస్ట్రేలియా గత సిరీస్‌లో డే నైట్‌ టెస్టును తొలగించింది. 

Also read: గంగూలీ గల్లీలో గులాబీ బంతి... దాని కథ కమామిషు

ఇప్పుడు సౌరభ్‌ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పగ్గాలు అందుకున్న తర్వాత భారత క్రికెట్‌లో గులాబీ మార్పులు వేగంగా చోటు చేసుకున్నాయి. కోల్‌కత వేదికగా తొలి గులాబీ డే నైట్‌ టెస్టులో బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. 

ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది గబ్బాలో గులాబీ బంతి యుద్ధం లో తలపడుదాం అంటూ కోహ్లికి ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పెయిన్ ఆహ్వానం పంపాడు. ' భారత్‌తో గులాబీ బంతి మ్యాచ్‌ కోసం ప్రయత్నిస్తున్నాం. విరాట్‌ కోహ్లి నుంచి ఏదో ఒక సమయంలో సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నాం. డే నైట్‌ టెస్టుతోనే ఆసీస్‌ వేసవి సీజన్‌ను ఆరంభిస్తోంది. కొంత కాలంగా ఇది కొనసాగుతుంది. కానీ గత ఏడాది ఇది జరుగలేదు. డే నైట్‌ కోసం విరాట్‌ కోహ్లిని అడుగుతాం. అతడు అంగీకరిస్తే గబ్బాలో గులాబీ సమరమే' అని టిమ్‌ పెయిన్ వ్యాఖ్యానించాడు.

click me!