స్మిత్ ఓ చెత్త ఆటగాడు...అతడితో కోహ్లీకి పోలికా..!: జాంటి రోడ్స్

By Arun Kumar PFirst Published Sep 18, 2019, 3:25 PM IST
Highlights

సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ యాషెస్ సీరిస్ లో వరుస సెంచరీలతో అదరగొట్టిన స్టీవ్ స్మిత్ పై విరుచుకుపడ్డాడు. అతడు సాధించిన సెంచరీలను అత్యంత చెత్తవంటూ కామెంట్ చేశాడు. 

యాషెస్ సీరిస్ లో వరుస సెంచరీలతో చెలరేగిన ఆసిస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కేవలం ఆసిస్ అభిమానులే కాకుండా క్రికెట్ ప్రియులందరూ స్మిత్ పోరాటపటిమకు ఫిదా అయిపోయారు. కానీ సౌతాఫ్రికా మాజీ  ప్లేయర్ జాంటీ రోడ్స్ ను మాత్రం స్మిత్ ఆట ఆకట్టుకోలేకపోయింది. తాను ఇప్పటివరకు చూసిన అత్యంత సెంచరీల్లో తాజాగా స్మిత్ చేసినవే టాప్ లో వుంటాయంటూ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే స్మిత్ గొప్ప క్రికెటర్ అంటూ సాగుతున్న ప్రచారంపై రోడ్స్ కాస్త ఘాటుగా స్పందించారు. కేవలం ఆసిస్ అభిమానులకు మాత్రమే స్మిత్ కోహ్లీ కంటే గొప్ప ఆటగాడిగా  కనిపించవచ్చు. కానీ మిగతావారికి అలా అనిపించడం లేదు. కోహ్లీతో అతన్ని పోలుస్తూ నెంబర్ వన్ ఆటగాడంటూ ప్రచారం చేయడాన్ని రోడ్స్ తప్పుబట్టారు. మీ ఒక్కరి అభిప్రాయాన్ని అందరిపై  రుద్దాలని చూడకండంటూ ఆసిస్ అభిమానులకు సూచించారు.  

''విరాట్ కోహ్లీ ఆట అభిమానులను ఆకట్టుకునేలా వుంటుంది. అతడి షాట్ సెలెక్షన్ చాలా అద్భుతంగా వుంటుంది. మంచి బంతుల్ని గౌరవిస్తూనే చెత్త బంతులకు మాత్రమే అతడు పరుగులను ఆశిస్తాడు. అతడి పుట్ వర్క్ కూడా అద్భుతంగా వుంటుంది. కానీ స్మిత్ ఆట అలా వుండదు. అతడి  చెత్త యాక్షన్, బ్యాటింగ్ టెక్నిక్  తోనే సెంచరీలెలా సాధిస్తున్నాడో నాకయితే అర్థం కావడంలేదు. ఇంత  చెత్త బ్యాటింగ్ స్టైల్ కలిగిన ఆటగాన్ని తాను ఇప్పటివరకు చూడలేదు.'' అని రోడ్స్ కోహ్లీని పొగుడుతూ స్మిత్ ను విమర్శించారు. 

గతకొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో రాణిస్తున్న విరాట్ కోహ్లీ, యాషెస్ సీరిస్ లో అదరగొట్టిన స్టీవ్ స్మిత్ లలో ఎవరు అత్యుత్తమ ఆటగాడో అభిమానులు తేల్చుకోలేకపోతున్నారు. టెస్ట్ ర్యాకింగ్ లో కోహ్లీని స్మిత్ వెనక్కినెట్టినప్పటి నుండి వీరిద్దరిలోఎవరు గొప్ప ఆటగాడన్న ప్రశ్న మొదలయ్యింది. దీనిపై ఆస్ట్రేలియా, భారత  మాజీ క్రికెటర్లు, అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కానీ రోడ్స్ మాత్రం దీనిపై కాస్త ఘాటుగా  స్పందించారు.  

సంబంధిత వార్తలు 

కోహ్లీ, స్మిత్ లలో నెంబర్ వన్ ఎవరంటే...: గంగూలీ

ఆల్ టైమ్ రికార్డు దిశగా స్మిత్... కోహ్లీకి ఇక కష్టమేనా...?

ఒకే దెబ్బకు రెండు రికార్డులు బద్దలు... కోహ్లీ, యూసఫ్ లను వెనక్కినెట్టిన స్మిత్

''కోహ్లీ గొప్ప ఆటగాడే... స్మిత్ అంతకుమించి..''
 

click me!