మిస్సైల్ లాంటి బంతి.. స్టన్నింగ్ క్యాచ్: స్మిత్ సెంచరీ మిస్

Siva Kodati |  
Published : Dec 27, 2019, 08:30 PM IST
మిస్సైల్ లాంటి బంతి.. స్టన్నింగ్ క్యాచ్: స్మిత్ సెంచరీ మిస్

సారాంశం

రీఎంట్రీ తర్వాత రెచ్చిపోతున్న ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్.. కివీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఒక అద్భుతమైన క్యాచ్‌తో వెనుదిరిగాడు. 

రీఎంట్రీ తర్వాత రెచ్చిపోతున్న ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్.. కివీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఒక అద్భుతమైన క్యాచ్‌తో వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా న్యూజిలాండ్ పేసర్ నీల్ వాగ్నర్ వేసిన 105వ ఓవర్‌ను ఆడటానికి స్మిత్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.

Also Read:భోజనం వేళ వివక్ష, అక్తర్ వ్యాఖ్యలు: ఎవరీ డానిష్ కనేరియా?

చివర్లో అదే ఓవర్ నాల్గో బంతికి వాగ్నర్ వేసిన షార్ట్ పిచ్ బంతి ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. ఈ క్రమంలో గల్లీ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హెన్రీ నికోలస్ సింగ్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు.

గల్లీ పాయింట్‌లో బంతి వెనక్కి వెళుతున్న సమయంలో గాల్లో డైవ్ కొట్టి మరీ దానిని అందుకున్నాడు.. పూర్తిగా రెండు చేతుల్లో పడకపోయినా రెండు వేళ్లతో దానిని ఒడిసి పట్టుకున్నాడు. దీంతో స్మిత్ సెంచరీ ముగిసింది.

Also Read:సానియా భర్త షోయబ్ వెకిలి చేష్టలు: ధోనీ ఫోటోతో వ్యాఖ్య

కాగా.. 257/4 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా.. మరో 27 పరుగుల వద్ద స్మిత్ వికెట్‌ను కోల్పోయింది. ట్రానిడ్ హెడ్ 114, కెప్టెన్ టిమ్ పైన్ 79 హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్సులో 467 పరుగుల చేసింది. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: టీమిండియాకు తలనొప్పిగా మారిన స్టార్ ప్లేయర్ !
IND vs SA : టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలివే.. గంభీర్ దెబ్బ !