ఆసియా కప్ ఫైనల్ కు ముందు యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్,తో టిమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కొలంబో : ఆసియా కప్ టోర్నమెంట్ టీమిండియా అదరగొడుతోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై అద్భుత విజయంతో దూకుడు పెంచిన ఫైనల్ కు చేరుకుంది. ఇలాంటి సమయంలో యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ తో కెప్టెన్ రోహిత్ శర్మ 'పిచ్చోడిలా వున్నావే...అలా జరగదు' అంటూ మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అసలు రోహిత్ గిల్ తో ఎందుకలా అన్నాడు? వారి మధ్య జరిగిన సంభాషణ ఏమిటి? అన్నదానిపై క్రికెట్ అభిమానుల్లో చర్చ జరుగుతోంది.
ఇదిలావుంటే ఇవాళ(ఆదివారం) ఆసియా కప్ కు ఆతిథ్యమిస్తున్న శ్రీలంక తో టీమిండియా పైనల్లో తలపడనుంది. కొలంబో ప్రేమదాస స్టేడియంలో ఈ ఫైనల్ పోరు జరగనుంది. ఆరు ఆసియన్ కంట్రీస్ పాల్గొన్న ఈ మెగా టోర్నీలో ఇప్పటికే లీగ్ దశలో శ్రీలంకను భారత్ ఓడించింది. దీంతో ఫైనల్లో కూడా భారత్ ఖాయమన్న అభిప్రాయాన్ని టీమిండియా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.
undefined
Read More Asia cup final 2023: శుభ్ మన్ గిల్ కు యువరాజ్ సింగ్ రిప్లై
ఆసియా కప్ టోర్నీలో శ్రీలంక, భారత్ జట్లకు మంచి రికార్డ్ వుంది. అత్యధికసార్లు ఆసియా కప్ ఫనల్ కు(13 సార్లు) చేరిన జట్టుగా శ్రీలంక నిలిస్తే అత్యధిక ట్రోపీలు (7సార్లు) సాధించిన రికార్డ్ మాత్రం భారత జట్టుదే. ఇప్పటివరకు ఆసియా కప్ లో భారత్ శ్రీలంక 22 సార్లు తలపడితే చెరో సగం మ్యాచులు గెలుచుకున్నారు. ఇలా సమఉజ్జీల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుండటంతో క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వన్డే వరల్డ్ కప్ కు ముందు ఆసియా కప్ విజయం ఏ జట్టుకయినా మంచి బూస్ట్ ఇవ్వనుంది. అందుకోసమే సర్వశక్తులు ఒడ్డి ఎలాగయినా ఈ ట్రోపీని గెలుచుకోవాలని ఇటు టీమిండియా, అటు శ్రీలంక జట్లు భావిస్తున్నారు. అందువల్లే గత మ్యాచ్ లో కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చిన భారత్ ఫైనల్లో వారిని బరిలోకి దింపుతోంది. ఇక బలమైన పాక్ ను ఓడించి ఫైనల్ కు చేరిన శ్రీలంక కూడా ఫైనల్లో విజయం కోసం తహతహలాడుతోంది. గాయాల కారణంగా కొందరు ఆటగాళ్లు జట్టుకు దూరమైన స్వదేశంలో గెలుపే లక్ష్యంగా లంక జట్టు ముందుకు వెళుతోంది.