విరాట్ కోహ్లీ చెత్త రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ

By Pratap Reddy Kasula  |  First Published Sep 16, 2023, 8:51 PM IST

ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా బంగ్గాదేశ్ మీద జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. తద్వారా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. భారత ఆటగాళ్లలో అత్యధిక మార్లు డకౌట్ అయిన ఆటగాళ్లలొ టెండూల్కర్ మొదటి స్థానంలో నిలిచాడు.


టీమిండియా సంచలన క్రీడాకారుడు విరాట్ కోహ్లీ పేర ఓ చెత్త రికార్దు ఉంది. దాన్ని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సమం చేశాడు. ఆసియా కప్ సూపర్ ఫోర్ లో భాగంగా బంగ్లాదేశ్ మీద జరిగిన మ్యాచ్ లో డకౌట్ కావడం ద్వారా రోహిత్ శర్మ ఆ రికార్డును సాధించాడు. తన 249 మ్యాచుల వన్డే కెరీర్ లో రోహిత్ శర్మకు ఇది 15వ డకౌట్. 

వన్డే క్రికెట్ లో ఒక్క పరుగు చేయకుండా 15 సార్లు ఔటైన విరాట్ కోహ్లీ రికార్దును రోహిత్ శర్మ తద్వారా సమం చేశాడు. ఎక్కువ సార్లు డకౌట్ అయిన ఆటగాళ్లలో శ్రీలంక లెజెండ్ సనత్ జయసూర్య ప్రథమ స్థానంలో నిలిచాడు. అతను 34 సార్లు ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్ చేరుకున్నాడు. భారత క్రికెట్ జట్టు గ్రేట్ సచిన్ టెండూల్కర్ 20 సార్లు డకౌట్ అయ్యాడు.

Latest Videos

undefined

వన్డేల్లో డకౌట్ అయిన భారత క్రికెటర్ల జాబితా ఈ విధంగా ఉంది.

సచిన్ టెండూల్కర్ - 20 సార్లు
జవగళ్ శ్రీనాథ్ - 19 సార్లు
అనిల్ కుంబ్లే - 18 సార్లు
యువరాజ్ సింగ్ - 18 సార్లు
హర్భజన్ సింగ్ - 17 సార్లు
సౌరవ్ గంగూలీ - 16 సార్లు
జహీర్ ఖాన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ - 15 సార్లు

ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా బంగ్లాదేశ్ మీద జరిగిన మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ 121 పరుగులు చేయగా అక్షర్ పటేల్ 42 పరుగులు చేశాడు. భారత్ బంగ్లాదేశ్ మీద ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బంగ్లాదేశ్ తమ ముందు ఉంచిన 266 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 49.5 ఓవర్లలో 259 పరుగులు చేసింది. ముస్తాఫిజుర్ రహ్మాన్ మూడు వికెట్లు తీశాడు. మెహెదీ హసన్, తాంజీమ్ హసన్ షకీబ్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.

తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్లు కోల్పోయి నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులు చేసింది. షకీబ్ అల్ హసన్ 80 పరుగులు, తాహవీద్ హ్రుదోయ్ 54 పరుగులు చేశారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా మొహమ్మదమ్ షమీ రెండు వికెట్లు పడగొట్టాడు.

click me!