Asia cup final 2023: శుభ్ మన్ గిల్ కు యువరాజ్ సింగ్ రిప్లై

By Pratap Reddy Kasula  |  First Published Sep 17, 2023, 11:32 AM IST

బంగ్లాదేశ్ మీద ఓటమిపై శుభ్ మన్ గిల్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. గిల్ కు యువరాజ్ సింగ్ కీలకమైన సూచన చేశాడు.


ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా బంగ్లాదేశ్ మీద జరిగిన మ్యాచ్ లో ఓటమిపై టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ చేసిన పోస్టుకు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రిప్లై ఇచ్చాడు. బంగ్లాదేశ్ మీద ఓటమి తర్వాత శుభ్ మన్ గిల్ పెట్టిన ఇన్ స్టా గ్రామ్ పోస్టు వైరల్ గా మారంది. బంగ్లాదేశ్ పై మ్యాచ్ లో తాను సెంచరీ సాధించిన తర్వాత కొట్టిన షాట్ ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లి అతను పెవిలియన్ కు చేరుకున్నాడు. దానిపై గిల్ పోస్టు పెట్టాడు. దానికి స్పందిస్తూ టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ... గిల్ కు కీలకమైన సూచన చేశాడు. 

నువ్వు పెవిలియన్ చేరడానికి చెత్త షాట్ కారణం. క్రీజ్ లో ఉండి వుంటే ఓంటి చేతితో ఇండియాను గెలిపించి ఉండేవాడివి. అయినా కూడా అద్భుతంగా ఆడావు. ఫైనల్ లో ఆ విధమైన పొరపాట్లు చేయవద్దు అని యువరాజ్ సింగ్ అన్నాడు.

Latest Videos

undefined

ఆసియా కప్ 2023 ఫైనల్ లో శ్రీలంకను ఢీకొట్టడానికి భారత్ సిద్ధమైంది. ఆసియా కప్ సూపర్ ఫోర్ లో బంగ్లాదేశ్ మీద ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైనప్పటికీ టోర్నీ ఫైనల్ లో ఇండియానే హాట్ ఫేవరైట్. అదే సమయంలో శ్రీలంకను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. టాప్ స్టార్స్ విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ లను పక్కన పెట్టి బంగ్లాదేశ్ మీది మ్యాచ్ లో భారత్ బరిలోకి దిగింది. 

తుది జట్టులోకి వచ్చిన తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. శుభ్ మన్ గిల్ 121 పరుగులు చేసి కీలకమైన సమయంలో ఓ చెత్త షాట్ ఆడి అవుటయ్యాడు. దాంతో మ్యాచ్ బంగ్లాదేశ్ చేతుల్లోకి వెళ్లింది.తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 265 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ 259 పరుగులకు అవుటైంది. అక్షర్ పటేల్ (42) ధాటిగా ఆడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

click me!