Asia Cup 2023 Final: టాస్ గెలిచిన శ్రీలంక... వరల్డ్ కప్ ముందు ఆసియా కప్ గెలిచేదెవరో...

By Chinthakindhi Ramu  |  First Published Sep 17, 2023, 2:35 PM IST

India vs Sri Lanka Asia Cup 2023 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక... ఇండియా - పాకిస్తాన్ మధ్య 9వ సారి ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్..


ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. కొలంబోలో జరిగిన ఐదు సూపర్ 4 మ్యాచుల్లో నాలుగింట్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే శ్రీలంక రెండోసారి విజయం సాధించింది.   

ఇండియా, శ్రీలంక మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగడం ఇది 9వ సారి. ఇంతకుముందు 5 సార్లు టీమిండియా, లంకను ఓడించి ఆసియా కప్ టైటిల్ గెలిచింది. మిగిలిన 3 సార్లు భారత్‌పై శ్రీలంక విజయం సాధించింది. 

Latest Videos

undefined

ఆసియా కప్ 2023 టోర్నీలో భారత జట్టు వరుసగా మూడు విజయాల తర్వాత బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఓడిపోయింది. అయితే బంగ్లాతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్,  కుల్దీప్ యాదవ్, హార్ధిక్ పాండ్యా వంటి కీ ప్లేయర్లు రెస్ట్ తీసుకున్నారు. అయినా ఆఖరి ఓవర్ వరకూ పోరాడగలిగింది భారత జట్టు..

వరుసగా హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు బాదిన రోహిత్ శర్మ, బంగ్లాతో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. శుబ్‌మన్ గిల్ సెంచరీతో అదరగొట్టాడు. కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు శుబ్‌మన్ గిల్. నేటి మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ నుంచి అలాంటి ఇన్నింగ్స్ ఆశిస్తోంది భారత జట్టు..

శ్రీలంకతో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో రోహిత్ శర్మ మినహా భారత టాపార్డర్ బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. లంక యంగ్ స్పిన్నర్ దునిత్ వెల్లలాగే 5 వికెట్లతో భారత జట్టుని చావు దెబ్బ తీస్తే, చరిత్ అసలంక 4 వికెట్లు పడగొట్టాడు. లంక స్పిన్నర్లను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేదానిపైనే ఫైనల్ రిజల్ట్ ఆధారపడి ఉంది..

వన్డే వరల్డ్ కప్ టోర్నీ ముందు ఆసియా కప్ విజయం టీమిండియాకి చాలా అవసరం. మరోవైపు శ్రీలంక, డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆసియా కప్ ఆడుతోంది. టీ20 ఫార్మాట్‌లో జరిగిన 2022 ఆసియా కప్ టైటిల్‌ని శ్రీలంక సొంతం చేసుకుంది. ఈసారి నలుగురు స్టార్ ప్లేయర్లు గాయపడిన తర్వాత కూడా అంచనాలను మించి రాణించి, ఆసియా కప్ ఫైనల్‌కి వచ్చింది శ్రీలంక..

కొన్నాళ్లుగా స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించలేక, వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ ఆడిన శ్రీలంక... వన్డే వరల్డ్ కప్ ముందు ఆసియా కప్ గెలిస్తే వారి ఆత్మవిశ్వాసం డబుల్ అవుతుంది. ఈ మినీ వరల్డ్ కప్ ఫైనల్ ఫైట్, ఇరు దేశాలకు చాలా కీలకంగా మారింది. 

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రిత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

 

శ్రీలంక జట్టు: పథుమ్ నిశ్శంక, కుసాల్ పెరేరా, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వ, దసున్ శనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుశాస్ హేమంత, ప్రమోద్ మదుషాన్, మథీశ పథిరాణా

 

click me!