Asia Cup 2023 Final: టాస్ తర్వాత సరిగ్గా ఆట ప్రారంభించే సమయానికి వర్షం... ఆలస్యంగా ప్రారంభం కానున్న ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్..
ఆసియా కప్ 2023 టోర్నీని వరుణుడు వదిలిపెట్టడం లేదు. కొలంబోలో ఇండియా - శ్రీలంక మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కానుంది. టాస్ తర్వాత సరిగ్గా ఆట ప్రారంభించే సమయానికి వర్షం కురవడంతో గ్రౌండ్ మొత్తం కవర్స్‌తో నింపేశారు గ్రౌండ్ స్టాఫ్..
ఫైనల్ మ్యాచ్ కావడంతో ఫలితం తేల్చేందుకు రేపు (సెప్టెంబర్ 18) రిజర్వు డే కేటాయించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. అయితే వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఈరోజు కంటే రేపు వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..
వర్షం కారణంగా శ్రీలంకలో జరిగిన దాదాపు అన్ని మ్యాచులకు అంతరాయం కలిగింది. భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన గ్రూప్ మ్యాచ్, వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దు అయ్యింది..
సూపర్ 4 రౌండ్‌లో ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ ఫలితం తేల్చేందుకు రిజర్వు డే కేటాయించాల్సి వచ్చింది. వర్షం కారణంగా రెండు రోజుల ఆటలో కూడా ఫలితం తేలకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు..