Ajaz Patel: ఒక ఇన్నింగ్సులో పది వికెట్లు తీసినోడికి ఆ మాత్రం గుర్తింపునివ్వరా..? ట్విట్టర్ పై అశ్విన్ సెటైర్లు

By team teluguFirst Published Dec 6, 2021, 4:10 PM IST
Highlights

India Vs New Zealand: టీమిండియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో కివీస్ ఓటమిపాలైనా ఆ జట్టు స్పిన్నర్, భారత సంతతి ఆటగాడు అజాజ్ పటేల్ కు మాత్రం జీవితాంతం మరిచిపోలేని జ్ఞాపకాలిచ్చింది.  ఒక్క టెస్టుతో ఓవర్ నైట్ స్టార్ అయినా ఈ ఆటగాడికి మాత్రం...!

ముంబై టెస్టులో న్యూజిలాండ్ ఓడినా ఆ జట్టు ఆటగాడు అజాజ్ పటేల్ కు  మాత్రం ఇది ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకమే. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో పదికి పది వికెట్లు తీసిన అజాజ్.. ఆ రికార్డు సాధించిన మూడో బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లతో కలుపుకుని అజాజ్ ఈ టెస్టులో మొత్తం 14 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన ఓ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఒక్క ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీసిన బౌలర్ కు గుర్తింపునివ్వాలని  అశ్విన్ ట్వీట్ చేశాడు.

తన ట్విట్టర్ వేదికగా స్పందించిన అశ్విన్.. ‘డీయర్ వెరీఫైడ్.. ఒక ఇన్నింగ్సులో పది వికెట్లు తీసిన బౌలర్ కచ్చితంగా ధృవీకరించడానికి అర్హుడు..’ అంటూ అజాజ్ పటేల్ పేరుతో పాటు నవ్వు, ఏడుపు కలగలిసిన ఎమోజీని పెట్టి ట్వీట్ చేశాడు. 

 

Dear , a ten wicket bag in an innings definitely deserves to be verified here! 😂

— Ashwin 🇮🇳 (@ashwinravi99)

టీమిండియాతో  ముంబై టెస్టులో వెలుగులోకి వచ్చిన అజాజ్ పటేల్ ట్విట్టర్ ఖాతాకు అధికారిక గుర్తింపు (ఈ వార్త రాసేటప్పటికి) లేదు.  ఇదే విషయాన్ని అశ్విన్ ఎత్తి చూపాడు. సెలబ్రిటీలు, పేరు మోసిన రాజకీయ నాయకులు, క్రికెటర్ల కు సంబంధించిన ట్విట్టర్ ఖాతాలకు.. ఆ సంస్థ Verified గుర్తింపునిస్తుంది. అయితే అజాజ్ కు ఇంకా ఆ వెరీఫైడ్ సింబల్ రాలేదు. 

టెస్టు క్రికెట్ లో  ఒక ఇన్నింగ్స్ లో పది వికెట్లు సాధించిన బౌలర్లలో అజాజ్ మూడో వాడు కావడం గమనార్హం. జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అయితే విదేశాలలో పది వికెట్లు తీసిన వారిలో అజాజ్ పటేల్ దే ప్రథమ  స్థానం. లేకర్, కుంబ్లే.. వారి స్వదేశాలలో ఈ ఫీట్ సాధించారు. 

 

You just cannot miss this 🗣️ 🎥 & in one frame 👍 👍

Stay tuned for this folks ⌛

Interview coming up soon on https://t.co/Z3MPyesSeZ pic.twitter.com/mCzzMuQ7aZ

— BCCI (@BCCI)

నాకు, నా కుటుంబానికి ఇది మరిచిపోలేని రోజు : అజాజ్ 

కాగా.. తన పది వికెట్ల ప్రదర్శనపై అజాజ్ పటేల్ పట్టలేని ఆనందంతో ఉన్నాడు. ముంబై టెస్టు అనంతరం రవిచంద్రన్ అశ్విన్.. అజాజ్ ను సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా అజాజ్ మాట్లాడుతూ.. ‘ఇది నేను, నా కుటుంబం మరిచిపోలేని రోజు. నేను పుట్టిన ముంబైలో  ఈ రికార్డు  సాధించడం ఇంకా స్పెషల్.  అయితే ఇందుకు చేసిన హార్డ్ వర్క్ ఏంటో నాకు తెలుసు. నా సంతోషాన్ని నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను.  ఈ ఫీట్ నా జీవితాంతం గుర్తుంచుకునేది.  చాలా మంది నాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నిజంగా ఈ రికార్డు సాధించినందుకు నేను అదృష్టవంతుడిని..’అని అన్నాడు. 

click me!