సంజు శాంసన్ ఎంపిక... పంత్ కు లక్ష్మణ్ చురకలు

By telugu teamFirst Published Nov 29, 2019, 5:18 PM IST
Highlights

రిషభ్‌ పంత్‌కు ఎక్కువ సమయం లేదని, సత్తా నిరూపించుకోవాల్సిందేనని వీవీఎస్‌ లక్ష్మణ్‌ తన మనసులోని మాటను పంచుకున్నాడు.

ఐపీఎల్‌లో విధ్వంసకర ప్రదర్శన తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న రిషభ్‌ పంత్‌ తొలినాళ్లలో తన బ్యాటింగ్‌ శైలితో బాగానే ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌ గడ్డపై టెస్టుల్లో శతకం సాధించిన తొలి వికెట్ కీపర్‌గానూ రికార్డు సృష్టించాడు కూడా. 

అయితే ఆ తర్వాత అటు బ్యాటింగ్‌ లోనూ, ఇటు కీపింగ్‌ లోనూ విఫలమవుతూ అభిమానులను నిరాశపరుస్తున్నాడు.  అయినా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మాత్రం అతడిపై అపార నమ్మకాన్ని ఉంచుతూ, ధోనికి వారసుడంటూ, భారత దేశానికి మరో ఎడమచేతి వాటం బ్యాట్స్ మెన్ దొరికాడంటూ, అతడికి చోటు కల్పిస్తూ వస్తోంది. అయితే ఫామ్‌లో ఉన్న మరో కీపర్‌ సంజూ శాంసన్‌ను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్న భావన అందరిలోనూ కలిగింది.

Also read: సగం గడ్డం సగం మీసం తో కలిస్ న్యూ లుక్... ఎందుకో తెలుసా?
 
ఇటీవలి బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్లో శాంసన్‌ను ఎంపిక చేసినా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడించలేదు. డ్రింక్స్ తేవడం వరకు మాత్రమే అతడు పరిమితమయ్యాడు. దానికితోడు, విండీస్‌తో ఆడే భారత జట్టు టీ20 జాబితాలోనూ తొలుత అతడిని పక్కనపెట్టారు.

దీంతో దేశవ్యాప్తంగా సెలెక్టర్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మాజీలు కూడా అతడికి అండగా నిలిచారు. హర్భజన్ సింగ్ అయితే ఏకంగా సెలెక్టర్లందరిని మార్చాల్సిందేనని డిమాండ్ చేసాడు. 

ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ గాయంతో తప్పుకోవడంతో, అతడి స్థానంలో సంజు శాంసన్‌ను తీసుకోవడం జరిగింది. గత సిరీస్ లో అతడిని తీసుకున్నారు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండానే నెక్స్ట్ సిరీస్ కు పనికిరాడని సెలెక్టర్లు ఎలా తేల్చారో ఆ దేవుడికే తెలియాలి.  

ఇక ఈ విషయమై లక్ష్మణ్ మాట్లాడుతూ, పంత్ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. బ్యాకప్‌ రూపంలో మరో కీపర్‌ సిద్ధంగా ఉన్నాడు కాబట్టి రిషభ్‌ పంత్‌కు ఎక్కువ సమయం లేదని, సత్తా నిరూపించుకోవాల్సిందేనని వీవీఎస్‌ లక్ష్మణ్‌ తన మనసులోని మాటను పంచుకున్నాడు. ఒకరకంగా శాంసన్‌ ఎంపిక ద్వారా టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు సెలెక్షన్‌ కమిటీ కూడా పంత్‌కు గట్టి హెచ్చరిక పంపినట్టయింది. ఇప్పటివరకు ఒకింత ఉదాసీనత చూపెట్టినప్పటికీ, ఇంకో పోటీదారుడు సిద్ధమవ్వడంతో రిషబ్ పంత్ ఇప్పుడు తనను తాను నిరూపించుకోవాల్సి వస్తుంది. 

Also read: గవర్నర్ గా.. శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్
 
 జట్టు మేనేజ్‌మెంట్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాల్సిన సమయం ఆసన్నమైందని యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌కు మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత వీవీఎస్‌ లక్ష్మణ్‌ సూచించారు. ' జట్టు మేనేజ్‌మెంట్‌, సెలక్షన్‌ కమిటీ పంత్‌కు సంజూ శాంసన్‌ రూపంలో మరో అవకాశం ఉందనే గట్టి సందేశం పంపించింది. రిషబ్‌ పంత్‌కు చాలా అవకాశాలు లభించాయి. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఈ విషయాన్ని పంత్‌కు తెలియజేసి, అతడికి ధైర్యం నూరిపోస్తుందని నేను అనుకుంటున్నాను. అంతిమంగా రిషబ్‌ పంత్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. దురదృష్టశావతు పంత్‌ ఆ పని చేయటం లేదు. పంత్‌ ప్రత్యేకమైన ఆటగాడు అని ఇప్పటికీ బలంగా నమ్ముతున్నాను. మ్యాచ్‌ను అలవోకగా మలుపు తప్పిగల సత్తా, సామర్థ్యం పంత్‌ సొంతం' అని వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు.  
 

click me!