ఉప్పల్ స్టేడియం లో అజర్ పేరిట కూడా స్టాండ్....

By telugu teamFirst Published Nov 29, 2019, 12:03 PM IST
Highlights

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడైన జాన్ మనోజ్ మాట్లాడుతూ, భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ దిగ్గజ క్రికెటర్ అజహరుద్దీన్ పేరున కూడా ఒక స్టాండ్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపాడు. 

క్రీయాశీల రాజకీయాలకు దూరమైనా.. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధ్యక్ష పగ్గాలు అందుకున్నాడు అజహరుద్దీన్. జస్టిస్‌ లోధా కమిటీ బీసీసీఐ సహా రాష్ట్ర క్రికెట్‌ సంఘాలను మాజీ క్రికెటర్లు నడపాలని అభిలాశించింది. 

కళంకిత క్రికెటర్‌గా మరక తుడుచుకునే పనిలో పడిన అజహరుద్దీన్‌, హెచ్‌సీఏలో అవినీతి అంతం చూసేందుకు వచ్చానని పదవీలోకి వచ్చిన అనంతరం పేర్కొన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడి సౌరభ్‌ గంగూలీతో సాన్నిహిత్యంతో అజహరుద్దీన్‌కు ఇప్పుడు బీసీసీఐలోకి మంచి గుర్తింపు లభిస్తోంది. 

Also read: అజర్ అధ్యక్షతన తొలి అంతర్జాతీయ మ్యాచుకు ఆతిథ్యమివ్వనున్న హైదరాబాద్

ఈ నేపథ్యంలోనే ఇండియా వెస్ట్ ఇండీస్ ల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్ లో ఒక మ్యాచ్ ను హైద్రాబాబ్డ్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం లో తొలి టి20 మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ అంగీకరించింది. 

డిసెంబర్‌ 6న ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో భారత్‌, వెస్టిండీస్‌లు తొలి టీ20లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ ఏర్పాట్లపై హెచ్‌సీఏ మీడియా సమావేశం నిర్వహించింది. 

ఈ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడైన జాన్ మనోజ్ మాట్లాడుతూ, భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ దిగ్గజ క్రికెటర్ అజహరుద్దీన్ పేరున కూడా ఒక స్టాండ్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపాడు. 

హైదరాబాద్‌ నుంచి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన స్టార్‌ ఆటగాళ్లలో మహ్మద్‌ అజహరుద్దీన్‌ ఒకరు. వీవీఎస్‌ లక్ష్మణ్‌, ఎన్‌.శివలాల్‌ యాదవ్‌ పేరిట ఇప్పటికే స్టేడియంలో రెండు వైపులా పెవిలియన్‌లు ఉన్నాయి.

Also read: అవినీతి ఆరోపణలు: అంబటి రాయుడికి అజరుద్దీన్ రిప్లై

 క్రికెటర్‌గా మహ్మద్‌ అజహరుద్దీన్‌ తిరుగులేని రికార్డులు సాధించినా, ఫిక్సింగ్‌ కేసు కారణంగా అజహర్‌ పేరిటి ఉప్పల్‌ స్టేడియంలో ఎటువంటి స్టాండ్‌ను ఏర్పాటు చేయలేదు. 

హెచ్‌ఏసీ అధ్యక్షుడుగా అజహరుద్దీన్‌ ఉన్న సమయంలోనే ఓ స్టాండ్‌కు అతడి పేరు పెట్టనున్నారు.

' హైదరాబాద్‌ క్రికెట్‌ స్టేడియంను సందర్శించిన వారు ఒక మాట అడుగుతారు. స్టేడియంలో చాలా మంది పేర్లు కనిపిస్తున్నాయి. మహ్మద్‌ అజహరుద్దీన్‌ పేరు ఎక్కడా లేదు? అని అడుగుతుంటారు. అందుకే నార్త్‌ పెవిలియన్‌ టెర్రస్‌ స్టాండ్‌కు అజహరుద్దీన్‌ పేరు పెడుతున్నాం. భారత్‌, వెస్టిండీస్‌ టీ20 మ్యాచ్‌ ఆరంభానికి ముందు స్టాండ్‌ను ఆవిష్కరిస్తాం. అర్షద్‌ అయూబ్‌, వెంకటపతి రాజు పేరిట సైతం స్టాండ్స్‌ పెట్టేందుకు ఎపెక్స్‌ కౌన్సిల్‌ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది' అని హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు జాన్‌ మనోజ్‌ తెలిపారు.  

click me!