సగం గడ్డం సగం మీసం తో కలిస్ న్యూ లుక్... ఎందుకో తెలుసా?

By telugu team  |  First Published Nov 29, 2019, 4:48 PM IST

ఒక చాలెంజ్‌లో భాగంగా ఖచ్చితంగా సగం గడ్డం, సగం మీసంతో దర్శనమిచ్చాడు. దక్షిణాఫ్రికాలో అంతరించిపోతున్న ఖడ్గ మృగాల సంరక్షణలో భాగంగా ‘సేవ్‌ ద రైనో’ చాలెంజ్‌ను స్వీకరించిన జాక్ కలిస్ ఇలా దర్శనమిచ్చి ఫాన్స్ ను ఆశ్చర్యపరిచాడు.  


దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌ రౌండర్‌ జాక్  కలిస్ గురించి తెలియని క్రికెట్‌ అభిమాని ఉండడు.  దక్షిణాఫ్రికా తరఫున సుదీర్ఘ కాలం క్రికెట్‌ ఆడిన కలిస్.. టెస్టుల్లో, వన్డేల్లో 10వేలకు పైగా పరుగులు, 250కి పైగా వికెట్లను సాధించిన ఏకైక క్రికెటర్‌ గా రికార్డు సృష్టించాడు.  

 

Latest Videos

undefined


తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను షేర్ చేసాడు. అది సగం షేవ్‌తో ఉన్న ఫొటో కావడంతో హాట్‌ టాపిక్‌ అయ్యింది. అయితే కలిస్ ఇలా ఎందుకు దర్శనమిచ్చాదనే విషయంపై మాత్రం ఒకింత ఆసక్తి నెలకొంది.  

Also read: అజర్ అధ్యక్షతన తొలి అంతర్జాతీయ మ్యాచుకు ఆతిథ్యమివ్వనున్న హైదరాబాద్

ఒక చాలెంజ్‌లో భాగంగా ఖచ్చితంగా సగం గడ్డం, సగం మీసంతో దర్శనమిచ్చాడు. దక్షిణాఫ్రికాలో అంతరించిపోతున్న ఖడ్గ మృగాల సంరక్షణలో భాగంగా ‘సేవ్‌ ద రైనో’ చాలెంజ్‌ను స్వీకరించిన జాక్ కలిస్ ఇలా దర్శనమిచ్చి ఫాన్స్ ను ఆశ్చర్యపరిచాడు.  

తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో కారులో కూర్చొని దిగిన సగం గడ్డం, సగం మీసం ఫోటోను పోస్ట్‌ చేయగా, అందుకు పాజిటివ్‌గా కామెంట్లు వస్తున్నాయి. కలిస్ కొత్త  లుక్‌లో అద్భుతంగా ఉన్నాడంటూ ఫ్యాన్స్‌ కొనియాడుతున్నారు.

తన కెరీర్‌లో 166 టెస్టులు, 328 వన్డేలను ఆడాడు కలిస్. టి20 ఫార్మాట్‌లో దేశం తరఫున 25 టీ20ల్లో పాల్గొన్నాడు.  టెస్టుల్లో 13,289 పరుగులు చేసిన కలిస్, వన్డేల్లో 11,579 పరుగులు చేశాడు. టెస్టుల్లో 292 వికెట్లు సాధించగా, వన్డేల్లో 273 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. 

2008లో విజ్డెన్ క్రికెటర్ అఫ్ ది ఇయర్ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. మొత్తం ఐపీఎల్ ఫార్మాట్లోనే బెస్ట్ అల్ రౌండర్ గా కలిస్ ని పేర్కొనడంతో ఎటువంటి అతిశయోక్తి లేదు. 2012 ఐపీఎల్ సీజన్లో 409 పరుగులు సాధించడమే కాకుండా 15 వికెట్లను కూడా తీసి ఔరా అనిపించాడు. కోల్కతా నైట్ రైడర్స్ కి హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. 

2015లో భారత పర్యటనలో దక్షిణాఫ్రికా ఘోరంగా ఓటమి చెందినప్పుడు కలిస్ భారత పిచ్ లపై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. విదేశాల్లో దక్షిణాఫ్రికా తొమ్మిదేళ్ల జైత్రయాత్రకు భారతలో అప్పుడు బ్రేక్‌ పడింది. 

Also read: ఉప్పల్ స్టేడియం లో అజర్ పేరిట కూడా స్టాండ్....

అన్ని మ్యాచ్‌ల్లోనూ టాస్‌ గెలవడం టీమిండియాకు కలిసొచ్చింది. ఇలాంటి టర్నింగ్‌ పిచ్‌లపై ప్రపంచంలో ఏ విదేశీ జట్టూ నెగ్గదని భావిస్తున్నానాని కలిస్ అభిప్రాయపడ్డాడు.  ఈ పరిస్థితుల్లో వరల్డ్‌ లెవెన్‌ టీమ్‌ కూడా ఓటమి తప్పించు కోవడం కష్టమే అని వ్యాఖ్యానించాడు. 

click me!