స్టేడియంలో మెరిసిన మరో కోహ్లీ... తన డూప్‌ని చూసి షాకైన విరాట్...

Published : Dec 08, 2020, 04:41 PM IST
స్టేడియంలో మెరిసిన మరో కోహ్లీ... తన డూప్‌ని చూసి షాకైన విరాట్...

సారాంశం

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో జనాల్లో ప్రత్యేక్షమైన విరాట్ డూప్... డూప్‌ని చూసి షాకైనట్టు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విరాట్ కోహ్లీ డూప్ ఫోటోలు...

మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. క్రికెటర్లలా కనిపించేవాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. శిఖర్ ధావన్‌లా ఉన్నాడంటూ ‘గబ్బర్’ పుట్టినరోజున ఓ వ్యక్తి ఫోటోను పోస్టు చేసి విషెస్ తెలిపాడు వీరేంద్ర సెహ్వాగ్. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీలా కనిపించే ఓ డూప్, స్టేడియంలో ప్రత్యేక్షమయ్యాడు. 

నల్ల కళ్లద్దాలు, టీమిండియా జెర్సీతో కనిపించిన సదరు డూప్‌ను చూసిన విరాట్ కోహ్లీ... ఓ నిమిషం షాక్ అయినట్టు కనిపించాడు. విరాట్ కోహ్లీలా కనిపించేందుకు నానా కష్టపడే ఇలాంటి వాళ్లకి కావాల్సింది గుర్తింపే. ఒకే ఒక్క మ్యాచ్‌లో తనకి కావాల్సిన క్రేజ్ తెచ్చుకున్న సదరు కోహ్లీ డూప్‌ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

 

PREV
click me!

Recommended Stories

IND vs SA: టీమిండియాకు తలనొప్పిగా మారిన స్టార్ ప్లేయర్ !
IND vs SA : టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలివే.. గంభీర్ దెబ్బ !