పాకిస్తాన్‌కి ఊరట... కరోనా నుంచి కోలుకున్న పాక్ క్రికెటర్లు... ప్రాక్టీస్ మొదలు...

By team teluguFirst Published Dec 7, 2020, 2:54 PM IST
Highlights

 ఐసోలేషన్‌లో 12వ రోజు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆటగాళ్లందరికీ నెగిటివ్..

డిసెంబర్ 8న ఐసోలేషన్ నుంచి బయటికి రానున్న పాక్ క్రికెట్ జట్టు...

న్యూజిలాండ్‌తో టీ20, టెస్టు సిరీస్ ఆడేందుకు కివీస్ గడ్డ మీద అడుగుపెట్టిన పాక్ క్రికెటర్లు, కరోనా రూపంలో తొలి అడ్డంకి ఎదురైన సంగతి తెలిసిందే. మొదటిసారి చేసిన పరీక్షలో ఆరుగురు, ఆ తర్వాత మరో నలుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

ఐసోలేషన్‌లో పాక్ క్రికెటర్లు ప్రోటోకాల్‌ను దాటి ప్రవర్తించడంతో బుద్ధిగా ఉండకపోతే, సిరీస్ రద్దు చేసుకుంటామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వార్నింగ్ కూడా ఇచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా ప్రోటోకాల్ దాటి ప్రవర్తిస్తుండడంతో ఓ యంగ్ స్పిన్నర్‌కి పాక్‌కి తిరిగి పంపించేందుకు పీసీబీ.

తాజాగా ఐసోలేషన్‌లో 12వ రోజు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆటగాళ్లందరికీ నెగిటివ్ వచ్చింది. దాంతో డిసెంబర్ 8న ఐసోలేషన్ నుంచి బయటికి రానుంది పాక్ జట్టు. క్విన్స్‌టౌన్‌కి బయలుదేరి వెళ్లనున్న పాక్, అక్‌లాండ్‌లోని ఈడెన్ పార్కులో డిసెంబర్ 18న తొలి టీ20 ఆడనుంది. న్యూజిలాండ్ టూర్‌లో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది పాక్ జట్టు.

click me!