ఆలస్యం చేసిన విరాట్ కోహ్లీ... రివ్యూకి అనుమతించని అంపైర్లు... ఆస్ట్రేలియాకి రెండు సార్లు...

By team teluguFirst Published Dec 8, 2020, 2:55 PM IST
Highlights

15 సెకన్ల దాటిన కారణంగా రివ్యూ తీసుకునే అవకాశాన్ని కోల్పోయిన టీమిండియా...

నటరాజన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న మాథ్యూ వేడ్...

చాహాల్ బౌలింగ్‌లో బతికిపోయిన మ్యాక్స్‌వెల్... ఆఖరి టీ20లో ఆస్ట్రేలియాకి అదృష్టం...

ఐపీఎల్‌తో పాటు అంతర్జాతయీ క్రికెట్‌లో కూడా అంపైర్లు నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. అంపైర్లు ఇచ్చిన నిర్ణయం కరెక్టు కాదని అనిపిస్తే, 15 సెకన్లలోపు రివ్యూ తీసుకునేందుకు అనుమతి ఉంటుంది. అయితే భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఆఖరి టీ20 మ్యాచ్‌లో 15 సెకన్ల దాటిన కారణంగా టీమిండియా రివ్యూ తీసుకునే అవకాశాన్ని కోల్పోయింది.

నటరాజన్ బౌలింగ్‌లో వేసిన ఓ బంతిని, దూకుడుగా ఆడుతున్న మాథ్యూ వేడ్ బీట్ అయ్యాడు. నటరాజన్‌తో పాటు కెఎల్ రాహుల్ కూడా అవుట్‌కి అప్పీలు చేశారు. అయితే అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించారు. 
రివ్యూ తీసుకోవాలా? లేదా? అని విరాట్ అండ్ కో చర్చిస్తున్నంతలోపు 15 సెకన్ల సమయం ముగిసింది. స్టేడియం స్క్రీన్‌లో రిప్లైలో వేడ్ అవుట్ అయ్యినట్టు స్పష్టంగా కనిపించింది.

దీంతో 15 సెకన్లు ముగిసిన తర్వాత రివ్యూకి అప్పీలు చేశాడు కోహ్లీ. అంపైర్లు రివ్యూకి తిరస్కరించారు. ఆలస్యమైందని చెప్పారు. మరోవైపు చాహాల్ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే ఆ బంతి నో బాల్‌గా తేలడంతో మ్యాక్స్‌వెల్ బతికిపోయాడు. ఇలా రెండుసార్లు ఆస్ట్రేలియాకి అదృష్టం కలిసి వచ్చింది.

Team India taken the review but it was denied by the 3rd umpire because the replay was shown on the big screen.

It would've been OUT, unlucky miss for India and T Natarajan. pic.twitter.com/QHPyXVOXrm

— Mufaddal Vohra (@mufaddal_vohra)

 

click me!