T20 World Cup 2024 లో మ‌రో సూప‌ర్ విక్ట‌రీ.. పాకిస్తాన్ ను చిత్తుచేసిన అమెరికా

By Mahesh Rajamoni  |  First Published Jun 7, 2024, 1:38 AM IST

T20 World Cup 2024, USAvPAK : టీ20 ప్రపంచకప్ 2024 లో అమెరికా మరో సూపర్ విక్టరీ అందుకుంది. అద్భుత ప్ర‌ద‌ర్శనతో మ్యాచ్ ను సూపర్ ఓవర్ కు తీసుకెళ్లింది. పాక్ ను చిత్తుచేస్తూ ఈ ప్రపంచ కప్ లో రెండో విక్టరీని అందుకుంది.


T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్ 2024లో అదిరిపోయే ప్ర‌ద‌ర్శ‌నతో అమెరికా పాకిస్తాన్ ను చిత్తుచేసింది. సూపర్ విక్టరీతో ఈ ప్రపంచ కప్ లో ఆడిన రెండు మ్యాచ్ లలో గెలిచి గ్రూప్ ఏ లో టాప్ లోకి వెళ్లారు. త‌మ‌కంటే ఎంతో బ‌ల‌మైన పాకిస్తాన్ ఏ మాత్రం తాము తక్కువ కాదంటూ అదరిపోయే బ్యాటింగ్, బౌలింగ్ తో అదరగొట్టారు. మరోసారి పాక్ అంచనాలను అందుకోలేకపోయింది. సూపర్ ఓవర్ లో గల్లీ క్రికెట్ లా ఆడింది పాకిస్తాన్.. దీంతో ఆ జట్టుకు అమెరికా చేతిలో ఓటమి తప్పలేదు.

డల్లాస్ లోని  గ్రాండ్ ప్రైరీ స్టేడియం మ్యాచ్ లో  జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 7 వికెట్లు కోల్పోయి 159 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. బాబర్ ఆజం 44 ప‌రుగులు, షాదాబ్ ఖాన్ 40 ప‌రుగుల‌తో రాణించ‌గా, మిగ‌తా ప్లేయ‌ర్లు క్రీజులో ఎక్కువ‌సేపు నిల‌వ‌లేక‌పోయారు. ఇక 159 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన అమెరికా ఆరంభం నుంచి అద‌ర‌గొట్టింది. అయితే, చివ‌రి మిడిల్ లో పాక్ బౌల‌ర్లు రాణించ‌డంతో ప‌రుగులు చేయ‌డానికి కాస్త ఇబ్బంది ప‌డింది. అయితే, చివ‌రివ‌ర‌కు పోరాడి మ్యాచ్ ను సూప‌ర్ ఓవ‌ర్ కు తీసుకెళ్లింది.

Latest Videos

undefined

సూప‌ర్ ఓవ‌ర్ లో సూప‌ర్ విక్ట‌రీ.. 

చివ‌రి ఓవ‌ర్ లో అమెరికా గెలుపున‌కు 15 ప‌రుగులు అవ‌స‌రం అయ్యాయి. మొద‌టి బంతికి 1 ప‌రుగు వ‌చ్చింది. రెండో బంతికి క్యాచ్ మిస్ చేయ‌డంతో మ‌రో ప‌రుగు వ‌చ్చింది. మూడో బంతికి కూడా  సింగిల్ మాత్ర‌మే వ‌చ్చింది. 4వ బంతిని ఆరోన్ జోన్స్ సిక్సుగా మ‌ల‌చ‌డంతో మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. 5 బాల్ కు ఒక ప‌రుగు వ‌చ్చింది. చివ‌రి బంతికి హరీస్ రవూఫ్ బౌలింగ్ ను చిత్తుచేస్తూ నితీష్ కుమార్ ఫోర్ కొట్టాడు. దీంతో మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్ కు వెళ్లింది.

ఈ ప్ర‌పంచ క‌ప్ లో ఇది రెండో సూప‌ర్ ఓవ‌ర్ మ్యాచ్ కావ‌డం విశేషం. సూప‌ర్ ఓవ‌ర్ లో పాకిస్తాన్ చెత్త ప్ర‌ద‌ర్శ‌న చేసింది. బౌలింగ్ టైమ్ లో గ‌ల్లీ క్రికెట్ ఆడుతున్నారేంది మామా అనేలా చెత్త గేమ్ ఆడారు. బౌలింగ్, చెత్త ఫీల్డింగ్ తో 18 ప‌రుగులు ఇచ్చుకున్నారు. పాకిస్తాన్ గెలుపున‌కు 19 ప‌రుగులు అవ‌స‌రం కాగా, కేవ‌లం 13/1 పరుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. ఈ మ్యాచ్ లో 50 ప‌రుగుల‌తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన మోనాంక్ పటేల్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

 

HISTORY MADE! 🤩

Stunning scenes in Dallas as USA pull off a remarkable Super Over win against Pakistan 🙌 | | 📝: https://t.co/qqGs7XvymF pic.twitter.com/zmmT40Erpb

— ICC (@ICC)

 

భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ కు ముందే విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన బాబర్ ఆజం

click me!