ముంబై కెప్టెన్‌గా అజింకా రహానే, వైస్ కెప్టెన్‌గా పృథ్వీ షా... తమిళనాడు కెప్టెన్‌గా విజయ్ శంకర్...

By Chinthakindhi RamuFirst Published Oct 18, 2021, 8:04 PM IST
Highlights

  సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో ముంబై జట్టుకి కెప్టెన్‌గా అజింకా రహానే... వైస్ కెప్టెన్‌గా ఎంపికైన పృథ్వీషా...

ఐపీఎల్ 2021 సీజన్ ముగిసింది. వచ్చే నెలలో దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ఆరంభం కానుంది. నవంబర్ 4 నుంచి మొదలయ్యే ఈ టోర్నీకి జట్టును ప్రకటించింది ముంబై జట్టు. ఈ సీజన్‌లో ముంబై జట్టుకి భారత టెస్టు వైస్ కెప్టెన్ అజింకా రహానే కెప్టెన్‌గా వ్యవహరిస్తుంటే, ఓపెనర్ పృథ్వీ షా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు...

ఎలైట్ గ్రూప్ బీలో ఉన్న ముంబై జట్టు, కర్ణాటక, సర్వీసెస్, బెంగాల్, ఛత్తీస్‌ఘడ్, బరోడా జట్లతో మ్యాచులు ఆడనుంది. ముంబై లీగు మ్యాచులన్నీ గౌహతీలో జరగనున్నాయి...  టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ఎంపికైన కారనంగా రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ ఈ టోర్నీకి దూరంగా ఉండబోతున్నారు...

ఐపీఎల్‌లో అదరగొట్టిన యశస్వి జైస్వాల్‌తో పాటు శివమ్ దూబే, ఆదిత్య తారే, సర్ఫరాజ్ ఖాన్‌లకు ముంబై జట్టులో చోటు దక్కింది... కరోనా పాజిటివ్‌గా తేలిన నటరాజన్‌తో క్లోజ్ కాంట్రాక్ట్ ఉండడంతో ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌కి దూరమైన ‘త్రీడీ ప్లేయర్’ విజయ్ శంకర్, తమిళనాడు జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.

ముంబై జట్టు : అజింకా రహానే (కెప్టెన్), పృథ్వీ షా, ఆదిత్య తారే, శివమ్ దూబే, తుషార్ దేశ్‌పాండే, సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ సోలంకి, సామ్స్ ములానీ, అధర్వ అంకోల్కర్, ధవల్ కులకర్ణి, హార్ధిక్ తామోర్, మోహిత్ అవస్తి, సిద్ధార్థ్ లాడ్, సైరాజ్ పాటిల్, అమన్ ఖాన్, అర్మన్ జాఫర్, యశస్వి జైస్వాల్, తనుష్ కోటియన్, దీపక్ శెట్టి, రోస్టాన్ దియాస్

click me!