అజింకా రహానే అవుట్... 86 పరుగులకే ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా...

Published : Feb 15, 2021, 10:25 AM IST
అజింకా రహానే అవుట్... 86 పరుగులకే ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా...

సారాంశం

86 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా... 10 పరుగులు చేసి పెవిలియన్ చేరిన అజింకా రహానే... 281 పరుగుల ఆధిక్యంలో టీమిండియా...

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 86 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 14 బంతుల్లో రెండు ఫోర్లతో 10 పరుగులు చేసిన అజింకా రహానే, మొయిన్ ఆలీ బౌలింగ్‌లో ఓల్లీ పోప్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన తర్వాత కేవలం 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది టీమిండియా. అయితే మొదటి ఇన్నింగ్స్‌లో దక్కిన ఆధిక్యం కారణంగా ఇంగ్లాండ్‌పై 281 పరుగుల ఆధిక్యంలో ఉంది టీమిండియా. 

విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, మిగిలిన టెయిలెండర్లతో కలిసి ఎంత స్కోరు చేస్తాడనేదానిపైనే టీమిండియా రెండో ఇన్నింగ్స్ స్కోరు ఆధారపడి ఉంది..

PREV
click me!

Recommended Stories

T20 World Cup: భారత జట్టులో శుభ్‌మన్ గిల్‌కు నో ఛాన్స్.. అసలు కారణం ఇదే !
T20 World Cup 2026: షాకిచ్చారు భయ్యా.. స్టార్ ప్లేయర్లను బయటకు పంపించేశారు !