వెంటవెంటనే రెండు వికెట్లు... పూజారా, రోహిత్ శర్మ అవుట్...

Published : Feb 15, 2021, 09:51 AM IST
వెంటవెంటనే రెండు వికెట్లు... పూజారా, రోహిత్ శర్మ అవుట్...

సారాంశం

పూజారా రనౌట్... రోహిత్ శర్మ స్టంపౌంట్... 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా... నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన రిషబ్ పంత్...

రెండో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా... మొదటి నాలుగు ఓవర్లలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరు54/1 వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా, మరో ఒక్క పరుగు మాత్రమే జోడించి పూజారా, రోహిత్ శర్మ వికెట్లను కోల్పోయింది.

23 బంతుల్లో ఒక్క ఫోర్‌తో 7 పరుగులు చేసిన పూజారా... మొయిన్ ఆలీ బౌలింగ్‌లో షాట్‌కి ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. షాట్ ఆడేందుకు క్రీజు ముందుకొచ్చిన పూజారా, బయటికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు బ్యాట్ స్ట్రక్ అవడంతో రనౌట్ అయ్యాడు.

ఆ తర్వాత కొద్దిసేపటికే జాక్ లీచ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ స్టంపౌంట్ అయ్యాడు. 70 బంతుల్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. అజింకా రహానే స్థానంలో రిషబ్ పంత్‌ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. 10 బంతులాడిన విరాట్ కోహ్లీ, ఇంకా ఖాతా తెరవలేదు. 

PREV
click me!

Recommended Stories

ఎలుకకు పిల్లి సాక్ష్యం అంటే ఇదేనేమో.! 'టీ20 ప్రపంచకప్‌ను గిల్ తెచ్చేస్తాడట'.. నమ్మేశాం.. నమ్మేశాం
IPL 2026 auction లో కామెరాన్ గ్రీన్ కు రూ.25 కోట్లు.. చేతికి వచ్చేది రూ.18 కోట్లే ! ఎందుకు?