INDvsENG: రిషబ్ పంత్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా...

Published : Feb 15, 2021, 10:05 AM IST
INDvsENG: రిషబ్ పంత్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా...

సారాంశం

65 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా... 8 పరుగులు చేసి రిషబ్ పంత్ అవుట్...  260 పరుగుల ఆధిక్యంలో టీమిండియా...

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన వికెట్ కీపర్ రిషబ్ పంత్, జాక్ లీచ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి స్టంపౌట్ అయ్యాడు.

11 బంతుల్లో ఒక ఫోర్‌తో 8 పరుగులు చేసిన రిషబ్ పంత్ అవుట్ కావడంతో 65 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా.మరోవైపు మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన భారత సారథి విరాట్ కోహ్లీ, మొదటి పరుగు చేసేందుకు 20 బంతులు తీసుకున్నాడు.

కోహ్లీతో పాటు అజింకా రహానే క్రీజులో ఉన్నారు. మూడో రోజు తొలి సెషన్‌లో 11 పరుగులు చేసిన టీమిండియా, మూడు వికెట్లు కోల్పోవడం విశేషం. ఇప్పటికే భారత జట్టు 260 పరుగుల ఆధిక్యంలో ఉంది.

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది