IPL 2024 - MS Dhoni: ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ అందించాడు ఎంఎస్ ధోని. 2024లో కూడా ట్రోఫీపై కన్నేయగా, ధోని లేకుంటే చెన్నై టీమ్ ను ఎవరు నడిపిస్తారనే చర్చ తెరమీదకు వస్తోంది.
Chennai Super Kings MS Dhoni : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024)17వ సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. చెన్నైలోని చెపాక్‌లో క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. 10 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. మరోసారి టైటిల్ గెలుచుకునే ఫేవరెట్ జట్టుగా చెన్నై బరిలోకి దిగుతోంది. ఎంఎస్ ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్ ఐదు ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుని అత్యంత విజయవంతమైన ఐపీఎల్ జట్టుగా కొనసాగుతోంది.
42 ఏళ్ల చెన్నై కెప్టెన్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ గా భావిస్తున్నారు. దీంతో అతడి తర్వాత చెన్నై జట్టుకు ఎవరు నాయకత్వం వహిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాశీ విశ్వనాథన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రాబోయే ఐపీఎల్ 2024 కోసం సిద్ధంగా ఉన్నామని చెప్పిన ఆయన.. కెప్టెన్, వైస్ కెప్టెన్ నియామకం గురించి మాట్లాడవద్దని కోరారు. ఆ విషయాలను జట్టు కోచ్, కెప్టెన్ (ధోని)కి వదిలేయండని పేర్కొన్నారు. త్వరలోనే వారు ఆ విషయాలపై నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
"కెప్టెన్, కోచ్ ఈ విషయంలో నిర్ణయించుకుని నాకు తెలియజేసిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను. అప్పటి వరకు ప్రశాంతంగా ఉండండి. ప్రస్తుత ఐపీఎల్ 2024లో నాకౌట్‌కు చేరుకోవడమే తొలి లక్ష్యం. దానిపైనే దృష్టిసారించామని" కాశీ విశ్వనాథన్ చెప్పారు. కాగా, ఎంఎస్ ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాలతో ఐపీఎల్ లో విజయవంతమైన జట్టుగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ధోని 5 ఐపీఎల్ ట్రోఫీలను అందించాడు. ధోని తర్వాత చెన్నై పగ్గాలు చేపట్టే ప్లేయర్ పై తప్పకుండా బలంగా ఒత్తిడి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నాయి. ఎందుకంటే చెన్నై టీమ్ పై అంచనాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.
T20 WORLD CUP 2024: టీ20 ప్రపంచకప్-2024 భారత జట్టులో కోహ్లి ఉంటాడు.. !