టీ20 ప్రపంచ కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ స‌రికొత్త చరిత్ర.. ఆస్ట్రేలియా సెమీస్ ఆశ‌లు గ‌ల్లంతు

By Mahesh Rajamoni  |  First Published Jun 25, 2024, 11:02 AM IST

AFG vs BAN: టీ20 ప్రపంచ కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర సృష్టించింది. సూపర్-8 ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్థాన్‌ విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఓట‌మితో ఆస్ట్రేలియా సెమీస్ ఆశ‌లు గ‌ల్లంతు అయ్యాయి. గ్రూప్-1లో సెమీఫైనల్‌కు అర్హత సాధించిన రెండో జట్టుగా ఆఫ్ఘనిస్థాన్ నిలిచింది.
 


 AFG vs BAN T20 World Cup 2024 : టీ20 ప్రపంచ కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర సృష్టించింది. సూపర్-8 ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్థాన్‌ విజయం సాధించింది. ఉత్కంఠ పోరులో థ్రిల్లింగ్ విక్ట‌రీతో సెమీస్ కు చేరుకుంది. బంగ్లాదేశ్ ఓట‌మితో ఆస్ట్రేలియా సెమీస్ ఆశాలు గ‌ల్లంతు అయ్యాయి. ఇప్ప‌టికే భార‌త జ‌ట్టు గ్రూప్-1 నుంచి సెమీ ఫైన‌ల్ చేరుకుంది. ఇప్పుడు గ్రూప్-1 నుంచి సెమీఫైనల్‌కు అర్హత సాధించిన రెండో జట్టుగా ఆఫ్ఘనిస్థాన్ నిలిచింది. తొలుత బ్యాటింగ్  చేసిన ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 115 ప‌రుగులు చేసింది. రిషద్ హొస్సేన్ 3 వికెట్లతో మెరిశాడు.

ల‌క్ష్య ఛేద‌న‌లో బంగ్లాదేశ్ వ‌ర్షం అంత‌రాయం కార‌ణంగా మ్యాచ్ ను 19 ఓవ‌ర్ల‌కు గానూ 114 ప‌రుగుల టార్గెట్ ను నిర్ణ‌యించాడు. కానీ, బంగ్లాజ‌ట్టు ఆఫ్ఘ‌నిస్తాన్ బౌలింగ్  ముందు నిల‌వ‌లేక‌పోయింది. 17.5 ఓవ‌ర్ల‌లో 105 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. 8 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. ఆఫ్ఘన్ బౌలర్లలో నవీన్-ఉల్-హక్ 4 వికెట్లు, కెప్టెన్ రషీద్ ఖాన్ 4 వికెట్లు తీసుకున్నారు. ఫజల్హక్ ఫారూఖీ, గుల్బాదిన్ నాయబ్ కీలక సమయంలో చెరో వికెట్ సాధించారు. 

Latest Videos

undefined

టీ20 నెంబర్.1 ప్లేయర్ గా రోహిత్ శర్మ.. కోహ్లీని అధిగమిస్తూ రికార్డులు బద్దలు కొట్టాడు

అయితే, ఈ మ్యాచ్ ను ప‌లుమార్లు వ‌ర్షం అడ్డుకుంది. రెండవ వర్షం విరామం తర్వాత రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు తీయడానికి ముందు నవీన్-ఉల్-హక్ రెండు వికెట్ల‌తో అద‌ర‌గొట్ట‌డం ఆఫ్ఘ‌న్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింది. బంగ్లాదేశ్ ను ఆఫ్ఘనిస్తాన్ ఎనిమిది పరుగుల తేడాతో ఓడించి టీ20 ప్రపంచ కప్‌లో మొదటి సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. స‌రికొత్త చ‌రిత్ర‌ను లిఖించింది. లిట్టన్ దాస్ తన అర్ధ సెంచరీ నాక్‌తో సూప‌ర్ బ్యాటింగ్ చేసినా జ‌ట్టుకు విజ‌యాన్ని అందించ‌లేక‌పోయాడు. 114 లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లాదేశ్ బ్యాట‌ర్లు ఘోరంగా విఫ‌ల‌మైన‌ప్పుడు దాస్ 54 పరుగులతో నాటౌట్ గా నిచిలాడు కానీ, అవ‌తలి ఎండ్ నుంచి స‌పోర్టు లేక‌పోవ‌డంతో బంగ్లాకు ఓట‌మి త‌ప్ప‌లేదు. కీల‌క స‌మ‌యంలో 4 వికెట్లు తీసుకున్న నవీన్-ఉల్-హక్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

 

Afghanistan's hero 🦸‍♂️ 🇦🇫

Naveen-Ul-Haq is awarded the POTM after his match-winning effort of 4/26 led his nation to the semi-finals 🏅 pic.twitter.com/Hs8YxfGUnq

— ICC (@ICC)

𝐖𝐇𝐀𝐓 𝐀 𝐌𝐎𝐌𝐄𝐍𝐓 𝐅𝐎𝐑 🇦🇫

Afghanistan are through to the 2024 semi-final 👏 pic.twitter.com/wugQg90R0I

— ICC (@ICC)

 

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లోనే బెస్ట్ క్యాచ్.. అక్ష‌ర్ ప‌టేల్ గాల్లోకి పక్షిలా ఎగిరి అద‌ర‌గొట్టాడు.. వీడియో 

click me!