2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన ఆఫ్ఘాన్... ఆ రెండు టీమ్స్‌కి కూడా...

By Chinthakindhi Ramu  |  First Published Nov 3, 2023, 9:16 PM IST

ICC World cup 2023: 2025లో పాకిస్తాన్‌లో జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన ఆఫ్ఘనిస్తాన్.. 


ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మొదటి 7 మ్యాచుల్లో 4 విజయాలతో సంచలనం క్రియేట్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. 2025లో పాకిస్తాన్‌లో జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘాన్ మొట్టమొదటిసారిగా ఆడనుంది. 

2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పాయింట్ల పట్టికలో టాప్ 7లో నిలిచిన జట్లు, 2025 ఛాంపియన్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయని ఐసీసీ తెలియచేసింది. మొదటి 7 మ్యాచుల్లో విజయం అందుకున్న భారత జట్టు, సెమీ ఫైనల్‌కి క్వాలిఫై అయిన మొదటి జట్టుగా నిలవడమే కాకుండా 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా క్వాలిఫై అయిన తొలి జట్టుగా నిలిచింది..

Latest Videos

సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు ఆతిత్య పాకిస్తాన్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది. మరో రెండు జట్లకు పాకిస్తాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే అవకాశం ఉంటుంది. శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు 7 మ్యాచుల్లో 2 విజయాలు అందుకుంటే, బంగ్లాదేశ్ ఒకే ఒక్క విజయం అందుకుంది. ఇంగ్లాండ్ 6 మ్యాచుల్లో ఒకే విజయం అందుకుంది..

ఇంగ్లాండ్ మిగిలిన 3 మ్యాచుల్లో గెలిస్తే, పాయింట్స్ టేబుల్‌లో టాప్ 7లోకి వెళ్లే అవకాశం ఉంది.  బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో మ్యాచులు ఆడబోయే శ్రీలంక, ఈ రెండూ గెలిస్తే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించగలదు. 

నవంబర్ 8న ఇంగ్లాండ్‌తో, నవంబర్ 12న టీమిండియాతో మ్యాచులు ఆడబోయే నెదర్లాండ్స్, టాప్ 7లో ముగించడం మాత్రం చాలా కష్టం... 

click me!