ఇండియాలో కోవిడ్ కంటే కష్టంగా ఉంది! పాక్ ఫెయిల్యూర్‌పై టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్..

By Chinthakindhi Ramu  |  First Published Nov 3, 2023, 7:33 PM IST

రోడ్ల మీద ఫ్రీగా తిరిగే వాళ్లను తీసుకొచ్చే హోటల్ రూముల్లో పడేశారు! స్వేచ్ఛ లేకపోవడం వల్లే మా వాళ్లు ఆడలేకపోతున్నారు.. పాకిస్తాన్ టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్ కామెంట్స్.. 


భారీ అంచనాలతో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని మొదలెట్టింది పాకిస్తాన్. నెదర్లాండ్స్, శ్రీలంకలపై వరుస విజయాలు అందుకున్న పాకిస్తాన్, టీమిండియాతో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఆ తర్వాత వరుసగా మరో 3 మ్యాచుల్లో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది..

బంగ్లాదేశ్‌పై గెలిచి కమ్‌బ్యాక్ ఇచ్చిన పాకిస్తాన్, నవంబర్ 4న న్యూజిలాండ్‌తో, నవంబర్ 11న ఇంగ్లాండ్‌తో మ్యాచులు ఆడనుంది. ఈ రెండు మ్యాచులు గెలిస్తే పాకిస్తాన్, సెమీ ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి..

Latest Videos

‘ఇండియాలో పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఇది మమ్మల్ని కాస్త ఇబ్బందిలోకి పడేసింది. ఎందుకంటే స్వేచ్ఛ లేకపోతే మా వాళ్లు ఫ్రీగా ఆడలేరు. కోవిడ్ టైమ్‌లోనే మా వాళ్లు స్వేచ్ఛగా బయట తిరిగారు. 

ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కి వాళ్ల ఫ్లోర్, వాళ్ల రూమ్ దాటి బయటికి వెళ్లేందుకు అవకాశాలు రావడం లేదు. బ్రేక్ ఫాస్ట్ కూడా సెపరేట్‌గా ప్లేయర్ల రూమ్‌కి వెళ్తోంది. మా ప్లేయర్లకు రోడ్ల మీద తిరగడం అలవాటు. 

విదేశాలకు వెళ్లినప్పుడు కూడా బయటికి వెళ్లి వేర్వేరు చోట్ల తినేవాళ్లు. ఇప్పుడు అవన్నీ లేకుండా జైలులో ఉన్నట్టుగా ఒకే దగ్గర ఉండడంతో కాస్త ప్రెషర్‌కి లోనవుతున్నారు.. ఇది చాలా చిన్న విషయంగా అనిపిస్తున్నా, కష్టమైన విషయం కూడా..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ క్రికెట్ టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్..
 

click me!