ICC World cup 2023: నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న ఆఫ్ఘాన్, ఊహించని విధంగా సెమీస్ రేసులోకి...
ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ నాలుగో విజయాన్ని అందుకుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న ఆఫ్ఘాన్, ఊహించని విధంగా సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది.
నవంబర్ 7న ఆస్ట్రేలియాతో, నవంబర్ 10న సౌతాఫ్రికాతో మ్యాచులు ఆడనుంది ఆఫ్ఘాన్. ఈ రెండు మ్యాచుల్లో విజయాలు అందుకుంటే ఆఫ్ఘాన్ సెమీస్ చేరే ఛాన్సులు పుషల్కంగా ఉంటాయి. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 179 పరుగులకి ఆలౌట్ కాగా ఈ లక్ష్యాన్ని 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది ఆఫ్ఘనిస్తాన్..
undefined
రెహ్మనుల్లా గుర్భాజ్ 11 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేయగా 34 బంతుల్లో 2 ఫోర్లతో 20 పరుగులు చేసిన ఇబ్రహీం జాద్రాన్‌ని వాన్ దేర్ మెర్వీ అవుట్ చేశాడు. రెహ్మత్ షా 54 బంతుల్లో 8 ఫోర్లతో 52 పరుగులు చేయగా కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ 64 బంతుల్లో 6 ఫోర్లతో 56 పరుగులు, అజ్ముతుల్లా ఓమర్‌జాయ్ 28 బంతుల్లో 3 ఫోర్లతో 31 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించారు..
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 179 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మ్యాక్స్ ఓడాడ్ 42, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ 58 పరుగులు, అకీర్‌మన్ 29 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ టాపార్డర్‌లో నలుగురు బ్యాటర్లు రనౌట్ కావడం విశేషం.. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఐదో ఓటమిని ఫేస్ చేసిన నెదర్లాండ్స్, సెమీ ఫైనల్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. నవంబర్ 8న ఇంగ్లాండ్‌తో, నవంబర్ 12న టీమిండియాతో మ్యాచులు ఆడనుంది నెదర్లాండ్స్..