భార‌త స్టార్ బౌలర్ అశ్విన్ పై ఏబీ డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్ !

By Mahesh Rajamoni  |  First Published Feb 22, 2024, 5:10 PM IST

Ravichandran Ashwin: భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో టీమిండియా స్టార్ బౌల‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ 500 వికెట్ సాధించి స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. అత్యంత వేగంగా టెస్టు క్రికెట్ లో 500+ వికెట్లు సాధించిన రెండో బౌల‌ర్ గా ఘ‌నత సాధించాడు. 
 


AB de Villiers - Ashwin : ర‌విచంద్ర‌న్ అశ్విన్.. భార‌త క్రికెట్ స్టార్ బౌల‌ర్. ఎన్నో రికార్డులు సృష్టించిన అశ్విన్ కు త‌గిన ప్రాధాన్య‌త ల‌భించ‌డంలేద‌ని ద‌క్షిణాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గ‌జం ఏబీ డివిలియ‌ర్స్ అన్నారు. టెస్టు క్రికెట్ లో 500+ వికెట్లు సాధించిన త‌ర్వాత అశ్విన్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది. ఈ క్ర‌మంలోనే 500 వికెట్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ రవిచంద్రన్ అశ్విన్ కు అభినంద‌న‌లు తెలిపారు. ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీని ఔట్ చేయడంతో అత్యంత వేగంగా 500 వికెట్ల మైలురాయిని అందుకున్న రెండో భారత బౌలర్ గా అశ్విన్ నిలిచాడు.

అశ్విన్ ప్రతిభ అతడిని భారత్ కు కెప్టెన్ గా మార్చిందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. రెండేళ్ల క్రితం తనకు ఈ గౌరవం ఇవ్వడానికి అనువైన సమయమని  పేర్కొన్నారు. గత ఏడాది భారత్ అనేక విభిన్న జట్లను బరిలోకి దింపింది,  ఆ స‌మ‌యంలో అశ్విన్ కు కెప్టెన్సీ ఇవ్వాల్సింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే ద‌క్షిణాఫ్రికా స్టార్ క్రికెట‌ర్ ఏబీ డివిలియ‌ర్స్ మాట్లాడుతూ.. రవిచంద్రన్ అశ్విన్ కు తగిన గుర్తింపు లభించడం లేదని అన్నాడు. అశ్విన్ పై ప్రశంసల జల్లు కురిపిస్తూ.. "ఎంత అద్భుతమైన విజయం! అభినందనలు అశ్విన్.. నేను ఆడిన అత్యంత కఠినమైన బౌలర్లలో మీరు ఒకరు - బ్యాట్, బంతి రెండింటితో భారత క్రికెట్ జట్టుకు మీరు గొప్ప ఆస్తి" అని పేర్కొన్నాడు.

Latest Videos

undefined

IPL 2024: గుజరాత్ టైటాన్స్ కు బిగ్ షాక్.. ఐపీఎల్ నుంచి మహ్మద్ షమీ ఔట్ !

"అశ్విన్ ఒక ధైర్యవంతుడు.. అద్భుత‌మైన క్రికెట‌ర్.. కానీ అతను భారత జట్టులో అతను పోషించే పాత్రకు ఎప్పుడూ తగినంత క్రెడిట్‌ని పొందలేదు. వాట్ ఎ లెజెండ్!" అని పేర్కొన్నాడు. అలాగే, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టుల్లో అశ్విన్‌పై సానుకూలంగా ఉండాలన్నాడు. "ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, అతను (అశ్విన్) పొడవాటి వ్యక్తి, కాబట్టి అతను సహజమైన వైవిధ్యం, బౌన్స్‌ని కలిగి ఉన్నాడు. అతను తన మణికట్టుతో సూక్ష్మమైన మార్పులను చేయ‌గ‌ల‌డు..  మరింత తగ్గించి, మరికొంత పెంచి బౌలింగ్ వేయ‌గ‌లడు" అని డివిలియర్స్ త‌న YouTube ఛానెల్ లో పేర్కొన్నాడు. "అతను క్యారమ్ బాల్.. లెగ్-స్పిన్ కూడా కలిగి ఉన్నాడు. అశ్విన్ అన్ని రకాల డెలివరీలు బౌలింగ్ చేస్తాడు" అని తెలిపాడు.

WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు స‌ర్వం సిద్ధం.. తొలి మ్యాచ్ ఆ రెండు జ‌ట్ల మ‌ధ్య‌నే.. !

 

click me!