కోహ్లీ ఫాంలోకి రావడానికి డివిలియర్స్ చెప్పిన ట్రిక్స్ ఇవే..!

By telugu news teamFirst Published Apr 17, 2021, 11:59 AM IST
Highlights

ఏబీ డివిలయర్స్ నుంచి కొన్ని సూచనలు తీసుకున్నాను.. ఆ తర్వాత  బాగా ఆడగలిగానంటూ కోహ్లీ స్వయంగా వివరించాడు. ఈ క్రమంలో..  ఆ రోజు కోహ్లీ తాను ఏం చెప్పాననే విషయాన్ని తాజాగా డివిలయర్స్ బయటపెట్టాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఆ మధ్య పరుగులు తీయడంలో చాలా వెనకపడిపోయాడు. పరుగుల రారాజుకి ఏమైదంటూ అందరూ కోహ్లీని వెలెత్తి చూపించారు. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ20లోనూ కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత రెండో టీ20 నుంచి మళ్లీ ఫాంలోకి వచ్చి చెలరేగిపోయాడు. 

ఏబీ డివిలయర్స్ నుంచి కొన్ని సూచనలు తీసుకున్నాను.. ఆ తర్వాత  బాగా ఆడగలిగానంటూ కోహ్లీ స్వయంగా వివరించాడు. ఈ క్రమంలో..  ఆ రోజు కోహ్లీ తాను ఏం చెప్పాననే విషయాన్ని తాజాగా డివిలయర్స్ బయటపెట్టాడు.

‘ ఆ విషయాలు చెప్పడానికి పెద్దగా ఆసక్తి లేదు. ఎందుకంటే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. కోహ్లీకి అప్పుడు నాలుగు విషయాలు చెప్పా. ఆటకు సంబంధం లేని విషయాలతోపాటు... టెక్నిక్ గురించి కూడా అప్పుడు మాట్లాడుకున్నాం. చాలా ప్రాథమిక అంశాలనే అతనికి వివరించాను. అంతకంటే కొన్ని రోజుల ముందు నుంచే అతనికి ఆ విషయాలను చెప్పాలని అనుకున్నాను. ఎందుకంటే దానికంటే ముందు కొన్ని నెలలుగా అతను బ్యాటింగ్ లో ఇబ్బంది పడ్డాడు. క్రీజులో నిలపడలేకపోయాడు. దీంతో.. అతని నుంచి మెసేజ్ రాగానే నాకు ఎలాంటి ఆశ్చర్యం కలగలేదు. అతనికి ప్రాథమిక అంశాలపై మరింత అవగాహన కావాలని నాకు తెలుసు.’’

‘ బంతిని సరిగా చూడటం, తలను నిటారుగా ఉంచడం, అనువైన ప్రదేశంలోకి బంతిని వచ్చేలా చేయడం, చివరగా శారీరకంగా, వ్యక్తిత్వం పరంగా ఉత్తమంగా ఉండటం అనేనాలుగు విషయాలను చెప్పా’ అని డివిలయర్స్ పేర్కొన్నాడు. దానికి సంబంధించిన వీడియోని ఆర్సీబీ ట్విట్టర్ లో పోస్టు చేసింది. 

click me!