ఐపీఎల్ లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న ధోనీ

By telugu news teamFirst Published Apr 17, 2021, 10:37 AM IST
Highlights

ఇది ఐపీఎల్‌లో ధోనీకి 206వ మ్యాచ్. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఇన్ని మ్యాచులు ఆడిన క్రికెటర్ కూడా ధోనీనే కావడం గమనార్హం. 

చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోనీ మరో అరుదైన రికార్డున తన ఖాతాలో వేసుకున్నాడు. చెన్నై తరఫున 200 మ్యాచులు ఆడిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి ఇన్ని మ్యాచులు ఆడిన తొలి క్రికెటర్ ధోనీనే కావడం విశేషం. పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచులో ధోనీ ఈ ఘనత సాధించాడు. 

ఇది ఐపీఎల్‌లో ధోనీకి 206వ మ్యాచ్. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఇన్ని మ్యాచులు ఆడిన క్రికెటర్ కూడా ధోనీనే కావడం గమనార్హం. తాను ఆడిన 206 మ్యాచుల్లో ధోనీ 40.63 సగటుతో 4,632 పరుగులు చేశాడు. ఇలా ఒక టోర్నీలో ఒక ఫ్రాంచైజీకి అత్యథిక మ్యాచులు ఆడిన క్రికెటర్‌గా ధోనీ రికార్డు సృష్టించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా... నిన్నటి మ్యాచ్ లో విజయం సాధించడం పట్ల ధోనీ మీడియాతో మాట్లాడాడు.‘గతంలో చెన్నై వికెట్‌ చాలా బాగుండేది. నాకు తెలిసి 2011లో చెన్నై వికెట్‌ చాలా బాగుంది. ఆ తర్వాత ఆ వికెట్‌తో మేము హ్యాపీగా లేము. దాన్ని పూర్వపు స్థితికి తీసుకురావడానికి చాలా గట్టిగా ప్రయత్నించారు. అయినా ఆ వికెట్‌లో ఎటువంటి మార్పులేదు. ఆ వికెట్‌పై బ్యాట్‌పై బంతికి సరిగా రాదు. అక్కడ భారీ షాట్లు ఆడాలంటే చాలా కష్టం’ అని తెలిపాడు. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో దీపక్‌ చాహర్‌ అద్భుతంగా బౌలింగ్‌ వేయడాన్ని కొనియాడాడు. చాహర్‌ డెత్‌ ఓవర్ల బౌలర్‌గా చాలా మెరగయ్యాడు.

‘‘నేను అతని చేతికి బంతి ఇచ్చిన ప్రతీసారి అందుకు న్యాయం చేస్తాడు. నేను అనుకున్న దాని కంటే పిచ్‌ను అర్థం చేసుకుని మరీ బౌలింగ్‌ చేస్తాడు. నేను ఎటాకింగ్‌ కోసం చూశాను కాబట్టి అతని చేత వరుసగా నాలుగు ఓవర్లు వేయించాను. మాకు ఉన్న బౌలింగ్‌ వనరులు కారణంగా చాహర్‌ చేత వరుసగా నాలుగు ఓవర్లు వేయించాను. ఇలా వరుసగా నాలుగు ఓవర్లు వేయించాలన్నా కూడా అతను ఫిట్‌గా ఉండాలి. అలా బౌలింగ్‌ చేయించడంతో చాహర్‌ మరింత ఫిట్‌ అవుతాడు. మేము మొయిన్‌ అలీ బ్యాట్‌ నుంచి భారీగానే ఆశిస్తున్నాము. ఆలీ ఆరంభంలో మెరుగ్గా ఆడితే మాకున్న మిగతా బ్యాటింగ్‌ వనరులను బాగా సద్వినియోగం చేసుకోగలము’ అని ధోని తెలిపాడు.

click me!