
ఈ సంవత్సరం అక్టోబర్ - నవంబర్ సీజన్లో జరగాల్సిన టి20 ప్రపంచ కప్ కి వేదికలను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈసారి ఎంపిక చేసిన వేదికల్లో హైదరాబాద్ కూడా ఉండడంతో తెలుగు ప్రజల ఆనందాలకు అవధులు లేకుండా పోతున్నాయి. మొత్తంగా హైదరాబాద్ సహా మరో 8 వేదికలను టి20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ ఎంపిక చేసింది.
ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు, ధర్మశాల, హైదరాబాద్, లక్నో నగరాల్లో ఈ టి20 క్రికెట్ సంగ్రామం జరగనుంది. అహ్మదాబాద్, లక్నో, హైదరాబాద్, చెన్నైలలో ఇంతవరకు టి20 ప్రపంచకప్ మ్యాచులు జరగలేదు. 2016 ప్రపంచ కప్ లో ఈ నగరాలకు ఆతిథ్య అవకాశం దక్కలేదు.
ఏ వేదికపై ఏ మ్యాచు జరుగుతుంది అనే విషయంలో ఇంకా క్లారిటీ రాకున్నప్పటికీ... ఫైనల్ మాత్రం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించనున్నట్టు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. కరోనా ఉధృతంగా ఉండడంతో కరోనా నిబంధనలను, మార్గాదర్శకాలను దృష్టిలో ఉంచుకునే మహాసమారానికి ఏర్పాట్లు చేయనున్నట్టు తెలుస్తుంది.
నిన్న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్నారు బీసీసీఐ సభ్యులు. ఇక ప్లేయర్ల వీసాల విషయానికి వస్తే అన్ని జట్లకు వీసాలు లభినాచనున్నట్టు ప్రాథమికంగా ఒక అధికారి ధృవీకరించారు. దీనితో పాకిస్థాన్ జట్టుకు కూడా వీసాలు అందనున్నాయి. దీనితో చాలా ఏండ్ల తరువాత భారత్ లో పాకిస్థాన్ జట్టు పర్యటించనుంది.
టి20 ప్రపంచ కప్ జరుగుతున్నప్పటికీ.... ప్రేక్షకులకు స్టేడియంలలోకి అనుమతి ఉంటుందా, ఉండదా అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే మ్యాచుల నిర్వహణే కష్టం. కానీ కోవిద్ సెకండ్ వేవ్ మే ఆఖరు నాటికి తగ్గిపోతుందన్న వార్తలు వస్తుండడం, వాక్సినేషన్ కూడా బాగా ఊపందుకోవడంతో దసరా నాటికి పరిస్థితులు ఒకింత శాంతించే అవకాశం ఉంటుందన్న ఆశాభావాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. చూడాలి రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో..!