సూసైడ్ చేసుకుందామని అనుకున్నా: టీమిండియా మాజీ పేసర్

By telugu teamFirst Published Jan 19, 2020, 6:45 PM IST
Highlights

టిమిండియాలో చోటు కోల్పోయి, ఐపిఎల్ కాంట్రాక్ట్ దక్కక డిప్రెషన్ కు వెళ్లిపోయి తాను ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నట్లు ప్రవీణ్ కుమార్ చెప్పారు. అయితే, తన పిల్లల చిరనవ్వు ఫొటో చేసి ఆత్మహత్య ప్రయత్నం విరమించుకున్నట్లు ప్రవీణ్ కుమార్ చెప్పారు.

న్యూఢిల్లీ: డిప్రెషన్ కారణంగా తాను ఆత్మహత్య చేసుకుందామని కొన్ని నెలల క్రితం అనుకున్నట్లు టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. హరిద్వార్ హైవేపై తన లైసెన్డ్ రివాల్వర్ తో కాల్చుకుందామని అనుకున్నానని ఆయన అన్నారు. అయితే చిరునవ్వుతో ఉన్న తన పిల్లల ఫొటోలు చూసిన తర్వాత ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం చాలలేదని అన్నాడు.

ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రవీణ్ కుమార్ ఆ సంచలన విషయాన్ని వెల్లడించాడు. టీమిండియాలో చోటు కోల్పోవడంతో పాటు ఐపిఎల్ కాంట్రాక్ట్ ముగియడం వంటి కారణాలతో తాను పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు ప్రవీణ్ కుమార్ చెప్పాడు. 

ఆ స్థితిలో ఇవన్నీ ఏమిటి, ఇక జీవితాన్ని చాలిద్దామని అనుకున్నట్లు ఆయన తెలిపారు. కెరీర్ ఆరంభంలో తనను అందరూ మెచ్చుకున్నారని, అదే విధంగా ఇంగ్లాండు సిరీస్ తర్వాత టెస్టు క్రికెట్ పై తాను ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, కానీ అనూహ్యంగా తనను జట్టు నుంచి తప్పించారని ఆయన వివరించారు. మళ్లీ అవకాశాలు ఇవ్వలేదని చెప్పారు.

దానికితోడు ఐపిఎల్ కాంట్రాక్ట్ కూడా ముగిసిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యానని, డిప్రెషన్ కారణంగా నరకాన్ని అనుభవించానని, అయితే డిప్రెషన్ గురించి భారత్ లో ఎవరు కూడా అర్థం చేసుకోరని తాను ఎవరికీ చెప్పలేదని ఆయన చెప్పారు. జాతీయ రహదారిపై కారును పక్కకు ఆపి గన్ తో షూట్ చేసుకుందామని అనుకున్నానని, కానీ నవ్వుతున్న తన పిల్లల ఫొటో చూసిన తర్వాత మనసు అంగీకరించలేదని ఆయన అన్నారుడ

తాను చనిపోతే తన పిల్లలు అనాథలవుతారని, తన కారణంగా అమాయకులైన తన పిల్లలు రోడ్డుపై పడుతారని, ఇది ఆలోచించి తన నిర్ణయం మార్చుకున్నానని ఆయన చెప్పారు. ఇప్పుడంతా కూల్ గా ఉందని, బాగానే ఉన్నానని, ప్రస్తుతం క్రికెట్ కోచింగ్ వైపు చూస్తున్నానని ఆయన వివరించారు.

ప్రవీణ్ కుమార్ 2007 నవంబర్ లో పాకిస్తాన్ తో జరిగిన వన్డే మ్యాచులో అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేశారు. 2012 మార్చి 30వ దక్షిణాఫ్రికాపై తన చివరి మ్యాచ్ ఆడారు. టీమిండియా తరఫున 6 టెస్టులు, 68 వన్డేలు, 10 టీ20లు ఆడారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 112 వికెట్లు తీశాడు. 

click me!