Year Ender 2023: ఈ ఏడాది  అంతగా కలిసిరాని క్రికెటర్లు ఎవరంటే.. ?

By Rajesh KarampooriFirst Published Dec 16, 2023, 4:54 AM IST
Highlights

Year Ender 2023: ఈ ఏడాది చాలా మంది క్రికెటర్లు అద్భుత ప్రదర్శన చేసి ఎన్నో రికార్డులు సృష్టించగా, అంచనాలను అందుకోలేకపోయిన వారు కూడా ఉన్నారు. కానీ, కొందరు బ్యాటింగ్‌లో, మరికొందరు బౌలింగ్‌లో విఫలమయ్యారు. బ్యాటింగ్ లేదా బౌలింగ్‌లోనే కాకుండా కెప్టెన్సీలో కూడా విఫలమైన వారు కొందరు ఉన్నారు. దీంతో అవకాశాలు కోల్పోతున్నారు. ఇలా ఈ ఏడాది విఫలమైన ఆటగాళ్ల లిస్టును ఓ సారి పరిశీలిద్దాం. 

Year Ender 2023: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్ భారత క్రికెట్ జట్టులోని స్టార్ ఆటగాళ్లు, వీరి పేర్లు ఏడాది పొడవునా ప్రతిధ్వనించాయి. ఈ ఆటగాళ్లు ఏడాది పొడవునా టీమ్ ఇండియా కోసం నిలకడగా రాణించారు. టీమ్ ఇండియా విజయానికి చాలా దోహదపడ్డారు. కానీ, కొంత మంది ఆటగాళ్లకు ఈ ఏడాది ఏమాత్రం కరెక్ట్ గా లేదు. వారు సెలెక్టర్ల మన్ననలు పొందలేక జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. జట్టులోకి తిరిగి వచ్చే మార్గం కొందరికి కష్టంగా మారగా, మరికొందరికి చాలా దారుణంగా  మారింది. సెలెక్టర్ల ద్రుష్టి పడక ఇబ్బంది పడుతున్నారు.  ఆ ఆటగాళ్లు ఎవరో ఓ లూక్కేద్దాం.. 

పుజారా: సుదీర్ఘ కాలం పాటు టెస్టు క్రికెట్‌లో టీమిండియా బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచిన వెటరన్ బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారా జట్టుకు దూరమయ్యాడు. గత 3-4 ఏళ్లుగా వరుసగా విఫలమవుతున్న పుజారా గతేడాది మాత్రమే జట్టులోకి తిరిగి వచ్చి బంగ్లాదేశ్‌లో అద్భుత సెంచరీ చేశాడు. అతను ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో, ఆ తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో విఫలమయ్యాడు. ఈ ఏడాది అతను 5 టెస్టుల్లో 181 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ కారణంగా అతను జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు అతని పునరాగమనం కష్టంగా కనిపిస్తోంది.

ఉమేష్ యాదవ్: టీమిండియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్‌ ఉమేష్ యాదవ గత ఐదేళ్లగా  చాలా సరైన ఫాం లేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆయనకు అవకాశాలు కూడా చాలా తగ్గాయి.  గతంతో ఆయన అవకాశం దొరికినప్పుడల్లా సత్తా చాటాడు. భారత పిచ్‌లపై ఎక్కువ టెస్టులు ఆడిన ఉమేష్.. తన సత్తాను చాటాడు. కానీ ఈ ఏడాది ఆస్ట్రేలియాతో ఆడిన 3 టెస్టుల్లో 5 వికెట్లు మాత్రమే సాధించాడు, ఫలితంగా అతను ఇకపై టెస్టు ఆడలేకపోయాడు. కొత్త బౌలర్ల రాకతో వారి పునరాగమనం కూడా కష్టమే.

యుజ్వేంద్ర చాహల్: దాదాపు రెండేళ్ల క్రితం వరకు టీమ్ ఇండియా ప్రధాన స్పిన్నర్‌గా ఉన్న యుజ్వేంద్ర చాహల్.. సరైన ఫామ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అటు సెలక్టర్లను ఇంప్రెస్ చేయలేకపోతున్నారు. దీంతో సరైన అవకాశాలను కోల్పోవల్సి వస్తోంది. ODI ప్రపంచ కప్ సంవత్సరంలో అతను కేవలం 2 ODI మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు, అందులో 3 వికెట్లు మాత్రమే వచ్చాయి. అలాగే.. ఈ ఏడాది 9 టీ20 మ్యాచ్‌లు ఆడిన అతను ఇక్కడ కూడా 9 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఫలితంగా వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో అతనికి చోటు దక్కేలా కనిపించడం లేదు. టీ20 ప్రపంచకప్‌లో వన్డే సిరీస్‌లో అతడిని చేర్చారు.

బాబర్ ఆజం: ఇక విదేశీ ఆటగాళ్ల విషయానికి వస్తే.. ఈ ఏడాది పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌కు ఆటతీరు కూడా సెలెక్టర్లను ఆకట్టుకలేకపోయారు. 2023 ప్రపంచ కప్‌లోవైఫల్యానికి ముందే అతని సమస్యలు పెరిగాయి. ఆసియా కప్‌లో విఫలమయ్యాడు. అంతకు ముందు 3 టెస్టు మ్యాచ్‌ల్లో అతను తన బ్యాట్‌తో 3 మ్యాచ్‌ల్లో 127 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ODIలో అతను 24 ఇన్నింగ్స్‌లలో 1065 పరుగులు చేశాడు. కానీ, ఇందులో కూడా ప్రపంచ కప్‌లో జట్టుకు ముఖ్యమైన సందర్భాలలో అతను విఫలమవడం విమర్శలకు కారణం. అంతేకాదు ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

జాస్ బట్లర్: ఇంగ్లండ్‌ వన్డే, టీ20 కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌కు కూడా ఈ ఏడాది అంతగా కలసిరాలేదు. అతని కెప్టెన్సీలో జట్టు ప్రపంచ కప్ టైటిల్‌ను కాపాడుకోవడంలో విఫలం కావడమే కాకుండా, ఆయన కూడా అంతగా ప్రతిభ కనబర్చలేకపోయారు. అతను బ్యాట్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ప్రపంచకప్‌కు ముందు కూడా బట్లర్ ఆటతీరు బాగానే ఉన్నా ప్రపంచకప్‌లో ఆ తర్వాత అద్భుతంగా ఏమీ చూపించలేకపోయాడు. ఈ ఏడాది 22 వన్డేల్లో కేవలం 747 పరుగులు చేశాడు. అలాగే 5 టీ20 ఇన్నింగ్స్‌లలో 151 స్ట్రైక్ రేట్‌తో 164 పరుగులు చేయగలిగాడు.

click me!