IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో చెన్నై, బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అయితే, ఐపీఎల్ ప్రారంభానికి ముందు స్టార్ ప్లేయర్ దూరం కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కు బిగ్ షాక్ తగిలింది.
IPL 2024 - Harry Brook : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) కు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాల వల్ల మార్చి 22న ప్రారంభం కానున్న 17వ ఎడిషన్ ఐపీఎల్ టోర్నమెంట్ నుండి వైదొలిగాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 4 కోట్లకు కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్, ఇటీవల భారత జాతీయ క్రికెట్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ నుండి కూడా వైదొలిగాడు.
జాతీయ జట్టు మ్యాచ్ ల కంటే వివిధ క్రికెట్ లీగ్ మ్యాచ్ లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనేటు వంటి కారణాలతో ఇంగ్లాండ్ టీమ్ పలువురు ప్లేయర్లను పక్కన పెట్టిందనే వార్తలు వచ్చాయి. ఇదే క్రమంలో భారత్‌తో ఇటీవల ముగిసిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు హ్యారీ బ్రూక్ ను దూరంగా ఉంచారనీ, ఇదపు సంబంధిత కారణాలతోనే ఐపీఎల్ 2024 నుండి తప్పుకుంటాడని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.
undefined
ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత్ హవా ! మనోళ్లు దుమ్ము రేపారు.. !
ఇదిలావుండగా, ఢిల్లీ క్యాపిటల్స్ కు గుడ్ న్యూస్ అందింది. కారు ప్రమాదం కారణంగా దాదాపు ఏడాదికి పైగా క్రికెట్ కు దూరంగా ఉన్న రిషబ్ పంత్ మళ్లీ ఐపీఎల్ తో గ్రౌండ్ లోకి దిగనున్నాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024కు ముందు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ లభించింది. కీపర్-బ్యాట్స్ మన్ ఢిల్లీ క్యాపిటల్స్ కోసం టోర్నమెంట్ కు పూర్తి ఫిట్ గా ఉంటాడని తెలిసింది.
గత వారం ఎన్సీఏలో ప్రాక్టీస్ మ్యాచ్ లో పాల్గొన్న తర్వాత రిషబ్ పంత్ కు క్లియరెన్స్ లభించినట్లు సమాచారం. గత వారమే కీపర్ బ్యాట్స్ మన్ ను ఎన్ సీఏ నుంచి క్లియరెన్స్ లభించగా, ప్రస్తుతం ఐపీఎల్ కోసం ఫొటోషూట్ లో పాల్గొంటున్న ఈ కీపర్ త్వరలోనే ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో చేరనున్నాడు. అయితే, రిషబ్ పంత్ ను కెప్టెన్సీ లో ఆడిస్తారా? లేక కెప్టెన్సీ లేకుండా కీపర్ గా ఆడిస్తారా? ఇవి రెండు కాకుండా బ్యాట్స్ మన్ గానే కొనసాగిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
15 బంతుల్లోనే 6 వికెట్లు... WPL 2024 లో ఎల్లిస్ పెర్రీ బౌలింగ్ తుఫాను !