
భారత మాజీ క్రికెటర్, 1983 వరల్డ్‌కప్ విన్నింగ్ హీరో యష్‌పాల్ శర్మ తుదిశ్వాస విడిచారు. 66 ఏళ్ల వయసులో గుండె పోటుతో మరణించారు. 1983 వన్డే వరల్డ్‌కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన యష్‌పాల్ శర్మ, ఆ టోర్నీలో వెస్టిండీస్‌పై 89 పరుగులు, ఇంగ్లాండ్‌పై 61 పరుగులు చేశాడు.
ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌లో స్టార్ బౌలర్ బాబ్ విల్లీస్ బౌలింగ్‌లో యార్కర్‌ను బంతిని స్వైయర్ లెగ్‌లో సిక్సర్‌గా మలిచిన యష్‌పాల్ శర్మ, క్రికెట్‌లో మెమొరబుల్ షాట్ ఆడాడు...
టీమిండియా తరుపున 37 టెస్టుల్లో 2 సెంచరీలతో 1606 పరుగులు చేసిన యష్‌పాల్, 42 వన్డేల్లో 883 పరుగులు చేశాడు. 2003 నుంచి 2006 వరకూ బీసీసీఐ సెలక్టర్‌గా కూడా వ్యవహరించారు. యష్‌పాల్ శర్మ మరణంపై మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, కృష్ణమాచారి శ్రీకాంత్, యువరాజ్ సింగ్ తదితరులు నివాళులు అర్పించారు.