ఇదెక్కడి మ్యాచ్ రా మావా... 7 పరుగులకి ఆలౌట్, 8 బంతుల్లోనే టార్గెట్ ఫినిష్...

By Chinthakindhi RamuFirst Published Jul 12, 2021, 12:31 PM IST
Highlights

యార్క్‌షైర్ ప్రీమియర్ టీ10 లీగ్‌‌లో దారుణమైన రికార్డు...

56 బంతుల్లో ముగిసిన మ్యాచ్... ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్ డకౌట్...

8 పరుగుల టార్గెట్‌ను 8 బంతుల్లో చేధించిన ప్రత్యర్థి...

యార్క్‌షైర్ ప్రీమియర్ టీ10 లీగ్‌‌కి ఇంగ్లాండ్‌లో మంచి ఫాలోయింగ్, క్రేజ్ ఉన్నాయి. అయితే ఈ లీగ్‌లో జరిగిన ఓ మ్యాచ్ ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్‌ని విస్తుపోయేలా చేస్తోంది. హిల్లమ్ అండ్ మోంక్ ఫ్రిస్టన్, ఈస్ట్ రింగ్‌స్టన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ కేవలం 56 బంతుల్లోనే ముగిసింది. అందులోనూ ఇరుజట్లూ కలిపి చేసింది 15 పరుగులే...

తొలుత బ్యాటింగ్ చేసిన హిల్లమ్ అండ్ మోంక్ ఫ్రిస్టన్ జట్టు 8 ఓవర్లలో 7 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 8 మంది బ్యాట్స్‌మెన్లు డకౌట్ కాగా ఇద్దరు బ్యాట్స్‌మెన్ రెండేసి పరుగులు చేయగలిగారు. మిగిలిన మూడు పరుగులు ఎక్స్‌ట్రాలుగా వచ్చాయి.

మూడో బౌలర్ కూడా అవసరం లేకుండా ఇద్దరు బౌలర్లతోనే బౌలింగ్ చేయించింది ఈస్ట్ రింగ్‌స్టన్ క్లబ్... మొత్తానికి 7 పరుగులకే ఆలౌట్ అయ్యింది  మోంక్ ఫ్రిస్టన్.. ఇందులో నాథన్ క్రింగర్ 4 ఓవర్లలో 3 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు.

8 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఈస్ట్ రింగ్‌స్టన్ 8 బంతుల్లో సులువుగా విజయం సాధించింది. ప్రొఫెషనల్ క్రికెట్‌లో అతి తక్కువ మ్యాచుల్లో, అతి తక్కువ సమయంలో ముగిసిన మ్యాచ్‌గా రికార్డు క్రియేట్ చేసిందీ మ్యాచ్.  కొన్నిరోజుల కిందటే ఓ క్లబ్ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ అందరూ డకౌట్ అయి, 2 పరుగులకు టీమ్ ఆలౌట్ అయిన మ్యాచ్ కూడా ఇంగ్లాండ్‌లోనే జరగడం విశేషం.

click me!