1 బంతికి 13 పరుగులు.. ప్ర‌పంచ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన టీమిండియా

By Mahesh Rajamoni  |  First Published Jul 14, 2024, 11:33 PM IST

India's world record: జింబాబ్వేతో జ‌రిగిన చివ‌రి టీ20 మ్యాచ్ లో భార‌త్ సూప‌ర్ విక్ట‌రీ అందుకుంది. శుభ్ మ‌న్ గిల్ కెప్టెన్సీలోని భారత జట్టు 4-1 తేడాతో సిరీస్ ను కైవ‌సం చేసుకుంది. ఈ క్ర‌మంలోనే పాకిస్తాన్ ను అధిగ‌మిస్తూ ప్ర‌పంచ రికార్డు సృష్టించింది. 
 


Team India's world record : 5 టీ20ల సిరిస్ లో భాగంగా భారత్-జింబాబ్వే జట్ల మధ్య జ‌రిగిన 5వ మ్యాచ్ హరారే వేదికగా జ‌రిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయ‌గా, యశస్వి జైస్వాల్, శుభ్ మ‌న్ గిల్ లు ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. జైస్వాల్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. కానీ, అత‌ని చిన్న ఇన్నింగ్స్ తో భారత జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 167 ప‌రుగులు చేసింది. ల‌క్ష్య ఛేద‌న‌లో జింబాబ్వే 18.3 ఓవర్ల‌లో 125 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. దీంతో భార‌త్ 42 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. 

పాకిస్తాన్ ను బీట్ చేసి ప్ర‌పంచ రికార్డు సృష్టించిన భార‌త్..

Latest Videos

ఈ మ్యాచ్ లో టీమిండియా అద్భుత‌మైన రికార్డును త‌న ఖాతాలో వేసుకుంది. టీ20 అంతర్జాతీయ  ఇన్నింగ్స్ లో తొలి బంతికే అత్యధిక పరుగులు చేసిన రికార్డు భారత జట్టుతో చేరింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో భారత్ తొలి బంతికే 13 పరుగులు చేసింది. దీంతో పాకిస్తాన్ జ‌ట్టు రికార్డును భారత్ బద్దలు కొట్టింది. 2022లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో పాక్ ఇన్నింగ్స్ తొలి బంతికి 10 పరుగులు చేసింది. 2023లో పాకిస్థాన్ పై న్యూజిలాండ్ 9 పరుగులు చేసింది. 2019లో భూటాన్ లో జరిగిన మ్యాచ్ లో నేపాల్ 9 పరుగులు చేసింది.

6 6 6 6 6 4.. మరోసారి యువరాజ్ సింగ్ సునామీ ఇన్నింగ్స్..

జింబాబ్వేతో జరిగిన భారత ఇన్నింగ్స్ లో సికిందర్ రజా తొలి బంతిని నో బాల్ వేయగా, ఆ బంతికి యశస్వి జైస్వాల్ సిక్సర్ కొట్టాడు. జైస్వాల్ ఫ్రీ హిట్  ను సిక్స‌ర్ గా మ‌లిచాడు. దీంతో భార‌త్ కు తొలి ఓవ‌ర్ తొలి బంతికే 13 ప‌రుగులు వ‌చ్చాయి. అయితే ఐదో బంతికి యశస్వి క్లీన్ బోల్డ్ అయ్యాడు. అంతకుముందు నాలుగో మ్యాచ్ లో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడి  హాఫ్ సెంచరీ సాధించాడు. కేవ‌లం 53 బంతుల్లో 93 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.

టీ20ల్లో తొలి బంతికి అత్య‌ధిక ప‌రుగులు చేసిన టాప్-5 దేశాలు 

13 ప‌రుగులు - భారత్ వర్సెస్ జింబాబ్వే, 2024
10 ప‌రుగులు - పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక, 2022
9 ప‌రుగులు - న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్, 2023
9 ప‌రుగులు - నేపాల్ వర్సెస్ భూటాన్, 2019
8 ప‌రుగులు - కెన్యా వర్సెస్ ఉగాండా, 2019

DELHI CAPITALS : రికీ పాంటింగ్ కు షాకిచ్చిన గంగూలీ టీమ్..

click me!