David Warner: గ్రౌండ్ లోనే ఏడ్చిన డేవిడ్ వార్న‌ర్.. వీడియో వైర‌ల్ !

By Mahesh Rajamoni  |  First Published Jan 6, 2024, 1:22 PM IST

David Warner: ఆస్ట్రేలియా లెజెండరీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సిడ్నీలో ఆడిన తన చివరి టెస్ట్ మ్యాచ్ తర్వాత, డేవిడ్ వార్నర్ చాలా భావోద్వేగానికి గురయ్యాడు. ఇంటర్వ్యూ మధ్య గ్రౌండ్ లోనే ఏడుస్తూ కనిపించాడు.
 


David Warner Test Retirement: ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. సిడ్నీలో ఆడిన చివరి టెస్టు మ్యాచ్ అనంతరం డేవిడ్ వార్నర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. పాకిస్థాన్ తో టెస్టు సిరీస్ తర్వాత రెడ్ బాల్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతానని డేవిడ్ వార్నర్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. డేవిడ్ వార్నర్ వీడ్కోలు టెస్టు సిడ్నీలో జరిగింది. ఈ మ్యాచ్ లో డేవిడ్ వార్న‌ర్ 57 ప‌రుగులు చేసి ఆస్ట్రేలియా జట్టుకు విజ‌యాన్ని అందించాడు.

ఏడ్చిన డేవిడ్ వార్నర్.. !

Latest Videos

సిడ్నీలో ఆడిన చివరి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు విజయంతో డేవిడ్ వార్నర్ కు వీడ్కోలు పలికింది. మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో కంగారూ జట్టు పాకిస్థాన్ ను 3-0తో వైట్ వాష్ చేసింది. డేవిడ్ వార్నర్ మళ్లీ ఆస్ట్రేలియా తరఫున టెస్టు క్రికెట్ ఆడడం లేదు. సిడ్నీలో ఆస్ట్రేలియా జట్టు విజయం తర్వాత కామెంటేటర్ డేవిడ్ వార్నర్ ను ఇంటర్వ్యూ కోసం సంప్రదించగా.. మాట్లాడుతూనే వార్న‌ర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. గ్రౌండ్ లోనే ఏడ్చేశాడు.

డేవిడ్ వార్న‌ర్ వీడియో వైర‌ల్ 

ఇంటర్వ్యూ సంద‌ర్భంగా డేవిడ్ వార్న‌ర్ గ్రౌండ్ తీవ్ర భావోద్వేగానికి గురై.. ఏడ్చేశాడు. కళ్ల నుంచి వచ్చే కన్నీటిని తుడుచుకుంటూ డేవిడ్ వార్నర్ హఠాత్తుగా అక్కడి నుంచి వెనుదిరిగి సహచరుల వద్దకు వెళ్లాడు. డేవిడ్ వార్నర్ కూడా మైదానంలో తన భార్యను కౌగిలించుకుంటూ కనిపించాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో భార్యను కౌగిలించుకున్న అనంతరం డేవిడ్ వార్నర్ భావోద్వేగానికి గురయ్యాడు. డేవిడ్ వార్నర్ కూడా తన ముగ్గురు కూతుళ్లను కౌగిలించుకుని కనిపించాడు. డేవిడ్ వార్నర్ కు సంబంధించిన పలు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

David Warner got emotional and crying when he was giving his interview.

An emotional moment for him🫶 pic.twitter.com/BhXAsl2PQj

— CricGuru (@Cse1Das)

 

వారం రోజుల్లో బరువు తగ్గొచ్చా..? ఎలా సాధ్యం..? 

click me!