100th Test: ముత్తయ్య మురళీధరన్ తర్వాత చరిత్రలో రెండో క్రికెటర్‌గా అశ్విన్ రికార్డు.. !

By Mahesh Rajamoni  |  First Published Mar 6, 2024, 1:11 PM IST

Ashwin's bowling records: ధర్మశాల టెస్టు మ్యాచ్‌లో ఆడ‌టంతో రవిచంద్రన్ అశ్విన్ భారత్ తరఫున 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన 14వ టీమిండియా ప్లేయ‌ర్ గా ఘ‌న‌త సాధిస్తాడు. ఇప్ప‌టివ‌ర‌కు అంత‌ర్జాతీయంగా క్రికెట్ చ‌రిత్ర‌లో మొత్తం 79 మంది క్రికెటర్లు 100 టెస్టులు ఆడారు. 
 


100th Test, Ravichandran Ashwin records: భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో చివ‌రి మ్యాచ్ కు ధ‌ర్మ‌శాల వేదిక కానుంది. ఇప్ప‌టికే ఇరు జ‌ట్లు  హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ప్రాక్టిస్ ను ప్రారంభించాయి. ఇరు జ‌ట్టు గెలుపుపై క‌న్నేశాయి. భారత్-ఇంగ్లాండ్ 5వ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ బౌల‌ర్ రవిచంద్రన్ అశ్విన్ మ‌రో ఘ‌న‌త సాధించ‌నున్నాడు. ఈ మ్యాచ్ ఆడ‌టంతో అశ్విన్ టెస్టు క్రికెట్‌లో భార‌త‌ జాతీయ జట్టు తరఫున 100 మ్యాచ్ లు  ఆడిన 14వ ప్లేయ‌ర్ గా నిలుస్తాడు. అలాగే, ఐద‌వ బౌల‌ర్ గానూ రికార్డు సృష్టిస్తాడు. అంత‌కుముందు, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మలు భార‌త్ త‌ర‌ఫున 100 టెస్టు మ్యాచ్ ల‌ను ఆడారు. ఇక మూడో స్పిన్న‌ర్ గా అశ్విన్ నిలుస్తాడు.

దీంతో పాటు దిగ్గ‌జ బౌల‌ర్ల రికార్డుల‌ను కూడా అశ్విన్ బ్రేక్ చేయ‌నున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్ప‌టికే అనిల్ కుంబ్లే తర్వాత 500 టెస్టు వికెట్లు తీసిన రెండో భారతీయుడిగా అశ్విన్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో కుంబ్లే భారత్ తరఫున అత్యధిక వికెట్లు (619 వికెట్లు) తీసిన బౌలర్ కాగా, అశ్విన్ కేవలం 98 మ్యాచ్‌ల్లోనే 500 వికెట్ల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్నాడు.

Latest Videos

టెస్ట్ క్రికెట్‌లో పరుగుల కంటే ఎక్కువ వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు

అంత‌ర్జాతీయ క్రికెట్ లో రెండో క్రికెట‌ర్ గా అశ్విన్ రికార్డు.. 

99 టెస్టులు ఆడి 584 వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్ తర్వాత 100వ టెస్టు ఆడే ముందు 500 వికెట్లు తీసిన తర్వాత ఈ మైలురాయిని పూర్తి చేసిన రెండో క్రికెటర్‌గా అశ్విన్ చరిత్రలో నిలిచాడు.

99 టెస్టు మ్యాచ్‌ల తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు 

ముత్తయ్య మురళీధరన్ - 584
ఆర్ అశ్విన్ - 507
అనిల్ కుంబ్లే - 478
గ్లెన్ మెక్‌గ్రాత్ - 446
షేన్ వార్న్ - 436

6 బంతుల్లో ఆరు సిక్స‌ర్లు.. మ‌రో భార‌త ప్లేయ‌ర్ సంచ‌ల‌న బ్యాటింగ్ !

అశ్విన్-ఇంగ్లాండ్ స్టార్ జానీ బెయిర్‌స్టో 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడ‌టంతో చరిత్రలో 76వ, 77వ క్రికెటర్‌గా నిలుస్తారు. ఇప్ప‌టివ‌ర‌కు 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన క్రికెట‌ర్లు 79 మంది ఉన్నారు. అయితే, 100 టెస్టు మ్యాచ్ ల‌కు ముందు 500 వికెట్లు తీసిన ఇద్దరిలో అశ్విన్ ఒకరిగి రికార్డు సృష్టించాడు. 2011లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ భారత్ తరఫున తన అరంగేట్రం చేసాడు. అప్ప‌టి నుంచి టీమిండియా టాప్ బౌల‌ర్ గా కొన‌సాగుతున్నాడు.

టెస్ట్ క్రికెట్‌లో పరుగుల కంటే ఎక్కువ వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు

click me!