ఒమిక్రాన్ వేరియంట్ చాప కింద నీరులా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. తాజాగా ఇండియాలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. గురువారం కర్ణాటకలో కోవిడ్-19 ఓమిక్రాన్ వేరియంట్ రెండు కేసులు నమోదయ్యాయి. కేవలం 9 రోజుల వ్యవధిలోనే 30 దేశాలకు వ్యాపించినట్టు తెలుస్తోంది.
Omicron Variant: కరోనా మహమ్మారి నుండి ప్రపంచ దేశాలు ఇప్పట్లో బయటపడేలా కనిపించడం లేదు. సౌతాఫ్రికాలో గత నెల 24న వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా .. చాప కింద నీరులా విస్తరిస్తోంది. కేవలం తొమ్మిది రోజుల్లోనే 30 దేశాలకు విస్తరించింది. అందులో భారత్ కూడా ఉండడం మరింత భయాందోళన కలుగ చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ప్రపంచవ్యాప్తంగా 24 దేశాలలో కొత్త వేరియంట్ గుర్తించారని చెప్పింది. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 375 కేసులు నమోదయ్యాయి. అందులో అత్యధికంగా.. సౌతాఫ్రికాలో 183 కేసులు నమోదయ్యాయి.
ఈ కొత్త వేరియంట్.. డెల్టా వేరియంట్ కంటే ఐదు రెట్ల వేగంతో వ్యాప్తి చెందుతున్నట్టు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. కొత్త వేరియంట్‌ను మొదటగా గుర్తించిన దక్షిణాఫ్రికా వైద్యుడు, ఇప్పటివరకు పరిశీలించిన రోగులు డెల్టా వేరియంట్ ద్వారా ప్రభావితమైన వారిలో అలసట, శరీర నొప్పులు ప్రధాన లక్షణాలుగా ఉన్నట్లు తెలుపుతున్నారు.
undefined
దీంతో అప్రమత్తమైనా.. ప్రపంచదేశాలు ఒమిక్రాన్ నివారణ చర్యలు చేపట్టాయి. కఠిన తరమైనా ఆంక్షలు విధిస్తున్నాయి. గతంలో కరోనా విజృంభించిన విధంగా కాకుండా.. ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వ్యాక్సినేషన్, మాస్కులు సహా కోవిడ్–19 నిబంధనలు పాటించడం ద్వారా ఈ మహమ్మారిని ఎదుర్కోవడమే సరైనదని భావిస్తున్నాయి ప్రపంచ దేశాలు.
రెండు డోసుల వ్యాక్సినేషన్ అయినవారిని మాత్రమే మార్కెట్లోకి అనుమతి ఇస్తున్నారు జర్మనీ లో. నిత్యావసరాల దుకాణాలకు తప్పితే అలాంటి వారిని మరే ఇతర స్టోర్లు, మాల్స్, పబ్బులు, క్లబ్బులు, సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతించబోమని జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ ప్రకటించారు. లాక్‌డౌన్‌లకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్న నెదర్లాండ్స్‌లో నిరసన ప్రదర్శనల్ని ప్రభుత్వం కఠినంగా అణచివేస్తోంది.
ఈ వేరియంట్ ను అరికట్టాలని గ్రీన్ ప్రభుత్వం కూడా కఠిన ఆంక్షాలు విధించింది. 60 ఏండ్ల పై బడిన వారు వ్యాక్సినేషన్ ను నిరాకరిస్తే.. వారి నెలవారీ పెన్షన్ నాలుగో వంతు కోత విధించాలని ఆదేశించింది గ్రీస్ ప్రభుత్వం.
స్టోవేకియాలో 60 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంటే 500 యూరోలు బోనస్‌గా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అమెరికా కూడా ఈ వేరియంట్ అరికట్టాడానికి కఠిన ఆంక్షాలను అమలు చేస్తోంది. ఇప్పటికే రెండు డోసులు పూర్తిచేసుకున్నవారికి బూస్టర్ డోసుల్ని ఇవ్వాలని యోచిస్తోంది.
మరోవైపు.. మన భారత్ కూడా అప్రమత్తమైంది. విదేశీ యాత్రికులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. విదేశాల నుంచి వచ్చేవారికి కరోనా పరీక్షలు తప్పనిసరి చేసింది. విదేశాలను నుంచి వచ్చిన ప్రయాణీకులకు కరోనా నెటిగివ్ వచ్చినా.. 14 రోజుల పాటు హోం క్వారెంటైన్ ఉండాలని హెచ్చరించింది. పాజివిట్ వస్తే వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెల్స్‌కి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. అప్రమత్తమైన తెలంగాణ సర్కారు ఆంక్షలు తప్పనిసరిగా పాటించాలని, మాస్క్ ధరించకుంటే రూ 1000 ల ఫైన్ తప్పదన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.
ఒమిక్రాన్.. యువతే టార్గెట్..!
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఒమిక్రాన్ పై సైంటిస్టులు పరిశోధన చేస్తున్నా.. ఎటువంటి స్పష్టత రాలేక తలలు పట్టుకుంటున్నారు. కొందరు మ్యూటేషన్లు మరింత ప్రమాదకరంగా మారనున్నాయని వారించినా పట్టించుకోవడం లేదు. ఈ వేరియంట్ మాత్రం డెల్టా వేరియంట్ కంటే.. ఐదు రేట్లు కష్టతరంగా ఉందని వెల్లడించారు.
ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ యువతపై అధిక ప్రభావం చూపిస్తుందనీ, యూత్ లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటంతో ఈ వైరస్ తీవ్రత బయటకు రావడం లేదనీ, ఈ వైరస్ పెద్దవారిలోనూ కనిపిస్తుంది. వారిలో తీవ్రమైన సమస్యలు కొన్ని వారాల వరకు కనిపించకపోవచ్చునని అని వైద్యనిపుణులు తెలుపుతున్నారు.
శాస్త్రవేత్తలు మరో కొత్త విషయాన్ని కనుగొన్నారు. మ్యూటేషన్ ప్రొఫైల్, వైరస్ స్వరూపాన్ని పరిశీలించగా.. ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి తగ్గుతున్నట్లు తేలింది. కొవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న వారికి ఒమిక్రాన్ నుంచి తప్పక రక్షణ లభిస్తుందని తెలిసింది.