కోవిడ్ సోకి తగ్గినా.. దాని ప్ర‌భావం రెండేళ్లకు పైగా ఉంటుంది - తేల్చిచెప్పిన కొత్త అధ్య‌యనం

By team teluguFirst Published May 12, 2022, 1:09 PM IST
Highlights

కోవిడ్ మహమ్మారి సోకి తగ్గిన వారిలో రెండేళ్లకు దాటినా కూాడా కరోనాకు సంబంధించిన ఏదో ఒక లక్షణం ఉంటుందని కొత్త అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం ది లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్ లో ప్రచురితం అయ్యింది.

కోవిడ్ -19 ప్ర‌పంచాన్ని ముప్పుతిప్ప‌లు పెట్టిన వైర‌స్. 2019 సంవత్స‌ర నుంచి ఈ వైరస్ మ‌న చుట్టూనే తిరుగుతూ ఉంది. అనేక వేవ్ లు వ‌స్తున్నాయి. పోతున్నాయి. అయితే ఈ వైర‌స్ దాని ప్ర‌భావంపై ప‌రిశోధ‌కులు అధ్య‌య‌నం చేస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో కొత్త అధ్య‌య‌నానికి సంబంధించిన ఓ ఫ‌లితం ఇటీవ‌ల వెలువ‌డింది. ఈ అధ్య‌య‌నం ది లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్ లో ప్ర‌చురితం అయ్యింది. దీని ప్ర‌కారం కోవిడ్ సోకి త‌గ్గిన రెండు సంవ‌త్స‌రాల తరువాత కూడా రోగుల్లో స‌గం మంది క‌నీసం ఒక ల‌క్షణాన్ని చూపించారని అని తెలిపింది. 

‘‘ ప్రారంభ వ్యాధి తీవ్రతతో సంబంధం లేకుండా కోవిడ్ -19 బాధితులు శారీరక, మానసిక ఆరోగ్యంలో దీర్ఘకాలిక మెరుగుదలను కలిగి ఉన్నారు. చాలా మంది రెండేళ్లలోపు వారి రోజు వారి జీవనంలోకి తిరిగి వచ్చారు. అయినప్పటికీ ఈ వ్యాధి లక్షణాల పర్యవసానాల భారం చాలా ఎక్కువగా ఉంది. కోవిడ్ -19 నుండి బయటపడినవారు రెండేళ్లలో సాధారణ జనాభా కంటే గణనీయంగా అనారోగ్య స్థితిని కలిగి ఉన్నారు. సుదీర్ఘ కోవిడ్ వ్యాధి కారకాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉందని, దీర్ఘకాలిక కోవిడ్ ప్రమాదాన్ని తగ్గించడానికి సమర్థవంతమైన జోక్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి ’’ అని అధ్యయనం పేర్కొంది. ఈ అధ్య‌య‌నం దీర్ఘకాలిక కోవిడ్ ను ఎదుర్కోవటానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని హైలైట్ చేసింది. 

‘‘ రెండు సంవత్సరాలలో దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు అంటే జీవన నాణ్యత తగ్గడం, తక్కువ వ్యాయామ సామర్థ్యం, అసాధారణ మానసిక ఆరోగ్యం, డిశ్చార్జ్ తర్వాత ఆరోగ్య సంరక్షణ అధిక వినియోగంతో సంబంధం కలిగి ఉన్నాయి ’’ అని అధ్యయనం తెలిపింది. లాన్సెట్ అధ్యయనంలో కోవిడ్ సోకిన రోగుల్లో రెండేళ్ల పాటు అలసట అనేది తరచుగా కనిపించిందని పేర్కొంది. ‘‘ ప్రారంభ వ్యాధి తీవ్రతతో సంబంధం లేకుండా మా పరిశోధనలకు అనుగుణంగా తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్) రికవరీ దశలో అలసట అధిక ప్రాబల్యం కూడా గమనించబడింది. ఇది నాలుగు సంవత్సరాల వరకు కొనసాగవచ్చు. ’’ అని తెలిపింది. 

2020 జనవరి 7. మే 2వ తేదీన వుహాన్ జిన్ యిన్-టాన్ హాస్పిటల్‌లో చేరి తీవ్రమైన కోవిడ్-19తో బాధపడుతున్న 1,192 మంది వ్యక్తులు ఈ అధ్యయనంలో ఉన్నారు. ఆరు నెలలు, 12 నెలలు, రెండు సంవత్సరాలలో చేసిన అధ్యయనాలు ఫలితాలపై ఇందులో అధ్యయనం జరిగింది. ఈ అధ్య‌య‌నంలో కీలకంగా ఉన్న చైనాలోని చైనా-జపాన్ ఫ్రెండ్షిప్ హాస్పిటల్ ప్రొఫెసర్ బిన్ కావో మాట్లాడుతూ..   ‘‘ కోవిడ్ తో బాధపడుతూ హాస్పిటల్ లో చేరి, తరువాత బయటపడిన వారు కొంత భాగానికి వారు ప్రారంభ సంక్రమణను క్లియర్ చేసినప్పటికీ, పూర్తిగా కోలుకోవడానికి రెండు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పడుతుంది. కోవిడ్ -19 ఉన్న గణనీయమైన నిష్పత్తిలో ప్రజలకు నిరంతర మద్దతును అందించాల్సిన అవసరం ఉంది. టీకాలు, అభివృద్ధి చెందుతున్న చికిత్సలు, వేరియంట్లు దీర్ఘకాలిక ఆరోగ్య ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ’’ అని చెప్పారు. 
 

click me!