కరోనా సోకిన పులి అన్నం తినడం లేదు.. యాంటీ బయాటిక్స్‌తో చికిత్స

By Siva Kodati  |  First Published Apr 7, 2020, 4:05 PM IST

న్యూయార్క్‌లోని బ్రాంక్జ్ జూలో నాలుగేళ్ల మలయన్ పులి నాదియాకి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కరోనా బారిన తొలి జంతువుగా నాదియాను జూ వైల్డ్ లైఫ్‌ కన్జర్వేషన్ సొసైటీ పశువైద్యుడు పాల్‌కాలే ఆదివారం ప్రకటించారు.


న్యూయార్క్‌లోని బ్రాంక్జ్ జూలో నాలుగేళ్ల మలయన్ పులి నాదియాకి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కరోనా బారిన తొలి జంతువుగా నాదియాను జూ వైల్డ్ లైఫ్‌ కన్జర్వేషన్ సొసైటీ పశువైద్యుడు పాల్‌కాలే ఆదివారం ప్రకటించారు.

ఈ ఘటన జరిగిన వెంటనే జూలోని మరో 6 పెద్ద పులులు పోడి దగ్గుతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. వాటికి రోగనిరోధక శక్తి మందులు ఇస్తున్నామని, ప్రస్తుతం వాటి ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని పాల్‌కాలే తెలిపారు.

Latest Videos

Also Read:48గంటల్లో కరోనాని చంపే మందు.. దొరికేసిందా...?

దీనిపై కాలే మాట్లాడుతూ... ఈ పులుల బాధ్యతను చూసుకునే సంరక్షకుల ద్వారా కొద్ది మోతాదులో టీఎల్‌సీ, కొన్ని రోగ నిరోధక మందులు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆ పులుల కోలుకుంటున్నాయని.. అంతేకాక స్వల్ప అనారోగ్యంతో ఉన్న జూలోని మరో 4 పులులకు, 3 సింహాలకు కూడా రోగ నిరోధక ఔషధాలు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.

undefined

అయితే కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకే అవకాశం లేదని భావిస్తున్నట్లు పాల్‌కాలే అభిప్రాయపడ్డారు. హాంకాంగ్‌లోని కొన్ని జంతువులు అనారోగ్యంతో బాధపడుతున్నాయని వాటికి కూడా కరోనా పరీక్షలు జరిగాయని తెలిపారు.

Also Read:లాక్‌డౌన్ రూల్స్ ఉల్లంఘించిన మంత్రి: ఏకేసిన జనం, రాజీనామా

వాటికి కరోనా సోకిందా, లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. నాలుగేళ్ల వయసు గల నదియా కరోనా వల్ల ఆహారం తీసుకోవడం మానేసిందని కాలే చెప్పారు. పులుల ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల నుంచి శ్వాబ్‌ను పరీక్షించాలంటే వాటికి అనస్థీషియా ఇవ్వాలి. కానీ పులులు అనారోగ్యంతో ఉన్నందున వీటిని అనస్థీషియా ఇవ్వాలని భావించడం లేదని కాలే తెలిపారు. 

click me!