48గంటల్లో కరోనాని చంపే మందు.. దొరికేసిందా...?

By telugu news team  |  First Published Apr 7, 2020, 2:17 PM IST

ఈ దశ దాటి మనుషుల మీద ప్రయోగాలు చేసిన తర్వాతే ఈ డ్రగ్‌ కరోనాను కూడా అంతే సమర్థంగా నిర్మూలించగలదో, లేదో తెలుసుకోగలమని డాక్టర్‌ వాంగ్‌స్టాఫ్ చెబుతున్నారు.


ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. దీనికి మందు ఎప్పుడు దొరకుతుందా అని ప్రతి ఒక్కరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే..అయితే ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న యాంటీవైరల్‌ డ్రగ్‌ ‘ఐవర్‌మెక్టిన్‌’ కణంలో కరోనా వైరస్‌ పెరుగుదలను నియంత్రిస్తుందని ‘యాంటీవైరల్‌ రీసెర్చ్‌’ అనే ఆస్ర్టేలియాకు చెందిన ఓ జర్నల్‌ ప్రచురించింది. 

Also Read ట్రంప్ బెదిరింపులు... వెనక్కి తగ్గిన భారత్...

Latest Videos

undefined

‘‘కణంలోకి ప్రవేశించిన మొత్తం కరోనా ఆర్‌.ఎన్‌.ఎను ఈ డ్రగ్‌ 48 గంటల్లో తొలగించగలుగుతుందని ఆస్ట్రేలియా మొనాష్‌ యూనివర్శిటీకి చెందిన కైలీ వాంగ్‌స్టాఫ్‌ చెప్పారు. ఐవర్‌మెక్టిన్‌ అనే ఈ యాంటీపారసైటిక్‌ డ్రగ్‌ డెంగ్యూ, ఇన్‌ఫ్లూయెంజా, జికా వైర్‌సలను సమర్థంగా నిర్మూలించే ప్రభావం కలిగి ఉందని నిరూపణ అయింది. అయితే ఇప్పటివరకూ ఇన్‌విట్రో పరీక్షల ద్వారా మాత్రమే ఈ విషయం నిరూపణ అయింది.

ఈ దశ దాటి మనుషుల మీద ప్రయోగాలు చేసిన తర్వాతే ఈ డ్రగ్‌ కరోనాను కూడా అంతే సమర్థంగా నిర్మూలించగలదో, లేదో తెలుసుకోగలమని డాక్టర్‌ వాంగ్‌స్టాఫ్ చెబుతున్నారు.

పాండెమిక్‌గా మారిన కరోనా వైరస్‌, దాన్ని సంహరించే మందుల లభ్యత లేని ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఈ డ్రగ్‌ ప్రభావం నిరూపణ అయిన పక్షంలో, కరోనా మీద తక్షణమే విజయం సాధించవచ్చు అని చెబుతున్నారు. అదే నిజమైతే ప్రపంచ దేశాలు కరోనా నుంచి బయటపడి ఊపిరిపీల్చుకుంటాయి.

click me!