కరోనా దెబ్బ: బ్రిటన్ లో భారత సంతతి డాక్టర్ జితేంద్ర మృతి

By narsimha lode  |  First Published Apr 7, 2020, 2:05 PM IST

ప్రముఖ హృద్రోగ నిపుణుడు, భారతీయ సంతతికి చెందిన డాక్టర్ జితేంద్ర కుమార్ రాథోడ్ కరోనా సోకి మృతి చెందాడు, బ్రిటన్ నేషనల్  హెల్త్ సర్వీసెస్ లో  ఆయన పనిచేస్తున్నాడు. 


లండన్: ప్రముఖ హృద్రోగ నిపుణుడు, భారతీయ సంతతికి చెందిన డాక్టర్ జితేంద్ర కుమార్ రాథోడ్ కరోనా సోకి మృతి చెందాడు, బ్రిటన్ నేషనల్  హెల్త్ సర్వీసెస్ లో  ఆయన పనిచేస్తున్నాడు. 

సుదీర్ఘకాలంగా బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ లో అసోసియేట్ స్పెషలిస్ట్ గా  జితేంద్రకుమార్ పనిచేస్తున్నాడు. ఎందరో ప్రముఖులకు ఆయన వైద్య సేవలు అందించాడు. 

Latest Videos

undefined

 జితేంద్రకు కరోనా వైరస్ సోకింది..ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మంగళవారం నాడు మృతి చెందినట్టుగా ప్రకటించారు అధికారులు.. కార్డియో థారోసిక్ సర్జరీలో ఆయనకు ఎంతో అనుభవం ఉంది. జితేంద్ర మృతి చెందిన విషయాన్నివేల్స్ యూనవర్శిటీ హెల్త్ బోర్డు ధృవీకరించింది. వేల్స్ యూనివర్శిటీ ఆసుపత్రిలోనే ఆయన మరణించినట్టుగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.

Also read:లాక్‌డౌన్ రూల్స్ ఉల్లంఘించిన మంత్రి: ఏకేసిన జనం, రాజీనామా

1977లో బొంబాయి యూనివర్శిటీలో వైద్య విద్యను అభ్యసించారు జితేంద్రకుమార్. ఆ తర్వాత  యూకేకు వెళ్లాడు. వైద్య రంగంలో దశాబ్దాల పాటు సేవలు అందించాడు. కరోనా  వైరస్ జితేంద్రకుమార్ కు సోకింది.  అయితే ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు.జితేంద్రకు భార్యతో పాటు ఇద్దరు కొడుకులు ఉన్నారు.

యూకేలో భారత సంతతికి చెందిన వారిలో 15 లక్షల మంది ఉన్నారు. వీరిలో ఎక్కువగా వైద్య విభాగంలో పనిచేస్తున్నారు. యూకేలో కరోనా వైరస్ తీవ్రంగా ఉంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా వ్యాధితో ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. ప్రిన్స్ ఛార్లెస్ కూడ ఈ వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే.

click me!