ప్రపంచం చస్తున్నా మారని చైనా: మళ్లీ ప్రారంభమైన మాంసం మార్కెట్లు, ఎగబడుతున్న చైనీయులు

By Siva Kodati  |  First Published Apr 1, 2020, 5:25 PM IST

కంటికి కనిపించిన ప్రతి జీవిని తినడం వల్లే మానవాళికి ఈ పరిస్థితి దాపురించిందని అంతా మండిపడుతున్నారు. వుహాన్‌లో ఓ మాంసం విక్రయ కేంద్రం కరోనా వైరస్ జన్మస్థలంగా ప్రస్తుతానికి తెలుస్తున్న సమాచారం. దీని కారణంగా చైనా ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని జంతు, సముద్రపు జీవుల విక్రయ శాలలను మూసివేసింది.


ప్రపంచవ్యాప్తంగా కరోనా ధాటికి అన్ని దేశాలు అల్లకల్లోలం అవుతున్నాయి. ఇప్పటికే సుమారు 40 వేల మంది ప్రాణాలు కోల్పోగా బాధితుల సంఖ్య 1 మిలియన్ వైపు వేగంగా దూసుకెళ్తోంది.

ప్రపంచానికి ఈ కష్టం కలగడం వెనుక కారణంగా చైనీయులు, వారి ఆహారపు  అలవాట్లేనని విమర్శిస్తున్నారు. కంటికి కనిపించిన ప్రతి జీవిని తినడం వల్లే మానవాళికి ఈ పరిస్థితి దాపురించిందని అంతా మండిపడుతున్నారు.

Latest Videos

Also Read:అమెరికా యుద్ధనౌకలో కరోనా వైరస్ బాధితులు: ఉన్నతాధికారులకు కెప్టెన్ లేఖ

వుహాన్‌లో ఓ మాంసం విక్రయ కేంద్రం కరోనా వైరస్ జన్మస్థలంగా ప్రస్తుతానికి తెలుస్తున్న సమాచారం. దీని కారణంగా చైనా ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని జంతు, సముద్రపు జీవుల విక్రయ శాలలను మూసివేసింది.

undefined

ఇప్పుడు ఆ దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో మాంసం విక్రయానికి అనుమతించింది. దీంతో గబ్బిలాలు, పందులు, కుక్కలు, పిల్లులు, పాముల మాంసం విక్రయాలు ఊపందుకున్నాయి.

అయితే చైనా ఫుడ్ మార్కెట్లలో తిరిగి అపరిశుభ్ర వాతావరణంలో మూగజీవాల మాంసం విక్రయం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం అక్కడ కరోనా వైరస్‌కు ముందున్న స్థితిలోనే మార్కెట్లు తిరిగి పనిచేస్తున్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తోంది.

Also Read:హెచ్ఐవీ నివారణకు పోరాడి.. కరోనా వైరస్ సోకి...

అయితే ప్రజలను ఫోటోలు తీసుకునేందుకు గతంలో మాదిరిగా అనుమతించడం లేదని తెలుస్తోంది. ఆగ్నేయ చైనాలోని గిలిన్ నగరంలో అస్వస్థతలను నివారించేందుకు గబ్బిలాలు, పాములు, స్పైడర్లు ఇతర మూగజీవాలను తినాలంటూ సూచించే ప్రకటన ఒకటి కలకలం రేపుతోంది.

ప్రపంచం కరోనా కారణంగా విలవిలలాడుతున్నా చైనా ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్‌‌ను చైనా వైరస్, వుహాన్ వైరస్ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు వ్యాఖ్యానించారు. వుహాన్‌లోనే తొలి కరోనా కేసు నమోదైందని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అన్ని దేశాలు భావిస్తున్నాయి. 

click me!