చెక్‌పోస్ట్ వద్ద అడ్డుకున్నారని.. పోలీసులను చితకబాదిన తల్లీకొడుకులు (వీడియో)

By Siva KodatiFirst Published Apr 3, 2020, 8:05 PM IST
Highlights

కరోనా కట్టడి కోసం కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, ప్రభుత్వానికి సహకరించాలని ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రులు, సెలబ్రిటీలు విజ్ఞప్తి చేస్తున్నారు.

కరోనా కట్టడి కోసం కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, ప్రభుత్వానికి సహకరించాలని ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రులు, సెలబ్రిటీలు విజ్ఞప్తి చేస్తున్నారు.

అయినప్పటికీ ఏమాత్రం బాధ్యత లేని కొందరు జులాయిలు రోడ్లపైకి యధేచ్ఛగా దూసుకొస్తున్నారు. తొలుత సహనంతో వారికి నచ్చచెప్పిన పోలీసులు, ఆ తర్వాత లాఠీలకు పని చెబుతున్నారు.

Also Read:తెలంగాణలో కొత్తగా మరో 27 మందికి కరోనా, 150 మార్కును దాటేసిన కేసులు!

అయితే కొందరు ఏకంగా పోలీసులపైనే తిరగబడుతున్నారు. తాజాగా మౌలాలీలో తల్లీకొడుకులు పోలీసులపై దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. లాక్‌డౌన్ సందర్భంగా మౌలాలీలో చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపట్టారు పోలీసులు.

అయితే శుక్రవారం తల్లికొడుకులు అటుగా వెళ్తుండటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వారు ఓ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని కొట్టే ప్రయత్నం చేశారు.

Also Read:9 నిమిషాల జిమ్మిక్కులకు కుదించొద్దు: మోడీపై ఓవైసీ ఫైర్

మధ్యలో కలగజేసుకున్న తోటి సిబ్బంది వారి బారి నుంచి పోలీసులను కాపాడి, అనంతరం అరెస్ట్ చేశారు. వీరిద్దరూ గతంలోనూ ఇదే విధంగా పోలీసులపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. 

కాగా తెలంగాణలో శుక్రవారం ఉదయం నాటికి కరోనా కేసులు 154కు చేరుకున్నాయి. ఆ మొత్తం కేసుల్లో ఇప్పటి వరకు 17 మంది డిశ్చార్జ్ అవ్వగా, 9 మంది మరణించారు. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులన్నీ కూడా ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలతో సంబంధాలు ఉన్నవే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మత ప్రార్థనల కోసం వెళ్లి వచ్చిన వారి ఆచూకి కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు.

"

click me!